ఆచారాలు పాటించుట వలన క్రైస్తవ్యానికి మేలు

*ఆచారాలు పాటించుట వలన క్రైస్తవ్యానికి మేలు కలుగుతుందా.???*

క్రీస్తునందు ప్రియ విశ్వాసులకు శుభములు..
మనదేశంలో మనపితరుల ద్వారాకలిగివున్న  పారంపర ఆచారపద్దతులు.. లెక్కకు మించివున్నవి,

⃣శుక్రవారము డబ్బు ఖర్చుచేయకూడదు.

⃣ శుక్రవారము ఇల్లు కడుగరాదు.

⃣ పిల్లి ఎదురు రాకూడదు.

⃣ తుమ్మినప్పుడు వెంటనే వెళ్ళకూడదు.

⃣ బయటకివెళ్ళేటప్పుడు ఎదురురావటం

⃣ వాస్తు పాటించటం.

⃣ మంచిరోజు కోసం చూడటం.

ఇలా లెక్కకు మించి ఎన్నో ఆచారాలు మనము కలిగి వున్నాము

వాపస్తవానికి మానవుడు ఈఆచారాలు ఎందుకు పాటిస్తున్నాడు..?

 1⃣  ప్రధమ కారణమెమంటే..  
*భయం*
ఇది చేయకపోతే ఏదో *కీడు* జరుగుతుంది..
అలాచేయకపోతేఏదో *నష్టం* కలుగుతుంది..
అనే భయం..

క్రీస్తుని తమ సోంత రక్షకునిగా అంగీకరించి..
ఆయన సంఘములో చేర్చబడిన
విశ్వాసి భయంతో కూడిన ఈలోకపరమైన ఆచారాలుపాటించటం ఎంతవరకువాక్యానుసారము..??
అసలు విశ్వాసి భయపడవచ్చా..??

  *భయపడవద్దు* అని బైబులులో.. అనేక పర్యాయములు వ్రాయబడివుంది..

 సామెతలు 29:25
భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును

హెబ్రీయులకు 2:14,15
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును,
*జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను..*
అన్ని భయాలకన్నా అతి పెద్ద
భయం *మరణభయం* దానిని తీసివేయటానికే క్రీస్తుయేసు ఈలోకానికి వచ్చెనని వాక్యం సెలవిస్తుంది..!

నీవు దేవుని వాక్యమును విశ్వసించే వానిగా వున్నట్లయుతే..
*మనుషులకు భయపడవు..*
*శత్రువులకు భయపడవు..*
*సమస్యలకు భయపడవు..*
*ఆచారాలకు భయపడవు..*
ఎందుకనగా.

*⃣  విశ్వసించేవాడు భయపడడు..*
        *భయపడేవాడు విశ్వసించడు..*

విశ్వాసము వలన *నీతి*
విశ్వాసము వలన *రక్షణ*
విశ్వాసము వలన *స్వస్దత*
విశ్వాసము వలన *విజయము*
విశ్వాసము వలన *సమస్తము సాద్యమే*

ప్రియ విశ్వాసి నీ విశ్వాస జీవితము ఎలా వుంది..?
దేవునివాక్యము సెలవిచ్చిన రీతిగా విశ్వాసము ద్వారా.. విశ్వాసము వలన కలుగు మేలులు, ఆశీర్వాదములు  పోందుకుంటున్నావా..?
 లేక మన పితరుల నుండి వచ్చిన ఆచారములు పాటించకపోతే.. ఎదో జరుగుతుంది అని భయంతో వ్యర్దమైన ఆచారాలు పాటిస్తూ..
వాక్యానికి అవిదేయునిగా వుంటున్నావా..?

 *ఆచారములు* పాటించుటకు
ఒక కారణం *భయం* అయితే..

   2⃣ రెండవకారణం
 *మేలు* కలుగుతుందనే ఆశ..

 విశ్వాసి *మేలు* పొందుకొవాలంటే..
మేలుల చేత తృప్తిపరచబడాలంటే..  వాక్యం సెలవిస్తుంది..
కీర్తనలు 34:10
సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ *మేలు* కొదువయై యుండదు..!

కీర్తనలు 31:19
నీయందు భయభక్తులుగలవారి నిమిత్తము నీవు దాచి యుంచిన *మేలు* యెంతో గొప్పది..!

ద్వితియోపదేశకాండము 5: 29
వారికిని వారి సంతాన మునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన *మేలు*.

మేలు పోందుకోవాలంటే..
✅ దేవుని ఆశ్రయుంచాలి,
 ✅దేవునియందు భయభక్తులు కలిగి  
         జీవించాలి,
✅ఆజ్ఞలను అనుసరించాలి.
     అని దేవుని వాక్యం సెలవిస్తుంది..!

క్రీస్తునందు ప్రియమైనవారలారా..!
 ఈ  లోక ఆచారములు..
దేవుని వాక్యమును నిరర్దకము చేస్తుంది..
దేవుని ఆజ్ఞలను అతిక్రమింపజేస్తుంది..
దేవుని నుండి దూరం చేస్తుంది.

మత్తయి 15: 3
అందుకాయనమీరును మీపారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు?

మత్తయు 15:6
మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.

మత్తయి 15:8
ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది;

యిర్మియా 10:3
జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును.

గమనించండి ప్రియులారా..!
లోకమునుండి ప్రత్యేకింపబడిన మనలో..
ఈలోకాచారములు కనిపించకూడదు,

⃣ *ఆచారము భక్తి చేయనివ్వదు..*
      *భక్తి ఆచారము చేయనివ్వదు..*

ఒకవేళ నీవు ఆచారములు పాటిస్తూ..
భక్తి చేస్తున్నావా..?
నిన్ను నీవే పరిశిలించుకోనుము..!

*దేవుడు మిమ్ముల్ని దీవించును గాక. ఆమేన్..!!*

Comments

  1. వందనాలు బ్రదర్. మీ మెసేజ్ లు PDFs చెయ్యడానికి అనుమతి ఇవ్వగలరు

    ReplyDelete

Post a Comment