దేవుడున్నాడా?

*_దేవుడున్నాడా?_*

👉 ఇది నిరంతరము వినబడే కొన్ని ట్రిలియన్ల డాలర్ల ప్రశ్న!

*A. దేవుడు అనగా స్వయంభవుడు.*
◆ అనగా తనకు తానుగా ఉన్నవాడు.

👉🏿దేవుడు అనే పదము హిబ్రులో *ఎల్,* గ్రీకులో *థియో,* అరమేక్లో *అల* అరబిలో *అలాహ్* అని లిపికరణముగా ఉచ్చరించబడింది.
*IMP* హిబ్రులో ఉన్న *ఎలోహీం* అనే పదము *తండ్రి,కుమార, పరిశుద్ధాత్మలను* సూచించే బహువచన పదము అయినప్పటికీ ఏకవచన భావముతోనే 2,750 సార్లు బైబిల్లో వాడబడింది.

*B. దేవుని అసలు పేరు యెహోవా!*
◆యెహోవా అనగా ఉన్నవాడు అని అర్థం. నిర్గమ.3:12,13.

*C. దేవుడు అనగా పులింగమనే ఒక వ్యక్తి.*
 ◆ప్రతి భాషలో ఏకవచనంతో పురుష వ్యక్తనే వ్యక్తపరచబడింది.

*D.దేవుడు అనే భావం: ఆత్మ, అదృశ్యుడు.*
◆కంటికి కనిపించే ఈ బాహ్య లోకానికి సంబంధించిన వస్తువో, బొమ్మో, వ్యక్తో కాదు.

*E. దేవుడు అనే నిర్వచనం:*
*1. Generator   సృష్టించేవాడు.*
*2. Operator     నడిపించేవాడు.*
*3. Destroyer    నాశనము చేసేవాడు.*
◆ఈ సృష్టిని సృష్టించి నడిపించి నాశనం చేసే వాడే దేవుడు.

*F. దేవుని లక్షణాలు గుణాలు!*
              *A.లక్షణాలు*
1.ఆత్మస్వరూపి.2.కొరి.3:17
2.సృష్టికర్త.యోహా.1:3, కొల.1:16,17.
3.సర్వజ్ఞాని.కొల.2:3.
4.సర్వ శక్తిమంతుడు.మత్త.8:26.
5.సర్వాంతర్యామి.మత్త.18:20, 28:20
6.నిత్యుడు.ప్రకటన.1:18, 22:13.
7.తేజస్సు కరమైన వెలుగు.అ.కా.9:3-7.
              *B.గుణాలు*
1.పరిశుద్ధుడు.అ.కా.3:14.
2.ప్రేమాస్వరూపి.1.యోహాను.4:18.
3.మార్పులేనివాడు.హెబ్రి.13:18
4.ఉగ్రుడు.రోమా.2:8.
5.కృపగలవాడు.యోహాను.1:16.
6.సత్యవంతుడు.యోహాను.7:18
7.అద్వితీయుడు.యోహాను.1:18.
◆గమనిక *లక్షణాలు* అనేవి దేవుని *capacity*ని తెలియజేసేవి, *గుణాలు* అనేవి దేవుని *character*ని తెలియజేసేవి. వీటి బట్టే నిజమైన దేవుడు ఎవరో సులువుగా గుర్తించగలము.

*G.ఇంతకీ అసలు దేవుడు ఉన్నాడా?*
*జ.దేవుడు ఉన్నాడు అనుటకు ఆధారాలు:*
*1.*కళ్ళముందున్న సృష్టి.రోమా.1:20.
*2.*గడుస్తున్న కాలం.కీర్తన.19:1-4.
*3.*మంచి చెడుల నియమము.గల.5:19-24.
*4.*వావివరసలు నాగరికత.లేవి.18:6-23.
*5.*నీతి న్యాయములు విధానం.యిర్మీ.22:3.
*6.*బైబిల్,క్రీస్తుయేసు,మానవుడు.మొదలగు.
◆ఇందునిబట్టి దేవుడు లేడు అనే వాడు ఎవడైనా వాడు బుద్ధిహీనుడే.కీర్తన.14:1.

👉🏿 *దేవుడు లేడని అడ్డుపడుతున్న నాస్తికుల హేతువాదులను ప్రశ్నలతో నిలదీస్తూ, యేసును నమ్మేలా చేయవచ్చు.*
◆సైన్స్ కూడా దేవుడు ఉన్నాడని స్పష్టముగా తెలియచేస్తుంది. ఏలాగనగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థము అదృశ్య శక్తి చేత ఆకర్షింపబడి ఒక పద్ధతి ప్రకారంగా ప్రయాణిస్తుందని సైన్స్ తెలియజేస్తుంది.
◆ *_ఆశక్తే The Great Attractor{దేవుడు}గా పిలువుబడుతుంది._*

 *కొంతమంది అప్పంబప్పం శాస్త్రవేత్తలు, సైన్స్ విద్యార్థులు ఒప్పుకోవడం లేదు.*  గాని *న్యూటన్, గెలీలియో, ఎడిసన్* లాంటి మరెందరో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు దేవుడు ఉన్నాడని అనేకమార్లు తెలియజేశారు.

*IMP* ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడు అనే దానికి ఉన్న ఆధారాలు మరే విషయానికి లేవని గ్రహించగలరు!

*ముగింపు: ఇంతవరకు మనము దేవుడు ఉన్నాడని, అయన అదృశ్యుడని, ఒక్కడే అని, సర్వశక్తి సంపన్నుడని తెలుసుకున్నాం.*

Comments