నామము అనగానేమి??
యేస్తుక్రీస్తు నామమున అంటే?
ఆరంభంలో యూదులు తన నోట సువార్త వాక్యం వీని ఎలా విశ్వసించారో, ఆలాగే అన్యజనుల ప్రవేశపు ఆరంభమందును "అన్యజనులు" తన నోట సువార్త వాక్యం వివి విశ్వసించులాగున దేవుడు పేతురును ఏర్పరచుకొన్నాడు (అపొ, 2:41; 15:7). గనుక ఆరంభంలో, పెంతెకొస్తు దినాన బాప్తిస్మం పొందవలసిన యూదులకు ఎలా ఆజ్ఞాపించబడిందో (అపొ. 2:38); అన్యజనుల ఆరంభమందు తన నోట సువార్త వాక్యం విని బాప్తిస్మం పొందవలసినవారికి అదే సంగతి చెప్పబడింది (అపొ. 10:40). అంటే, “మీరు మారుమనస్సు పొంది. ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడని” యూదులకు ఆజ్ఞాపించిన పేతురు, కొర్నేలీ యింట అన్యజనులతో మాట్లాడినప్పుడు కూడా "యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మము పొందవలెనని" వారికి ఆజ్ఞాపించాడు (అపొ. 10:48). “యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందడమంటే అర్థం ఏమో నీకు తెలియకపోయినా, యిది పొందేవారికి యివ్వబడిన ఆజ్ఞ అనే సంగతి మనస్సులో ఉంచుకొనడం అవసరం.
“నామమున" అనేది గ్రీకులో ఎలా ఉపయోగింపబడిందో చూడు. "Onama" అనే పదంనుండి “నామమున" అనేది వచ్చింది. ఈ "Onama" అనేదాన్ని తన Greek-English Lexiconలో థేయర్ ఎలా వివరించాడో చూడు:
Onama = to do a thing that is by one's Command and authority, acting on his behalf, promoting his cause, to do a thing of Jesus (p. 447)
యేస్తుక్రీస్తు నామమున అంటే, యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ప్రకారం చేయడం, ఆయన అధికార్తమును బట్టి చేయడం. ఆయన పక్షంగా చేయడం, ఆయన ఉద్దేశ్యాన్ని నెరవేర్చడం, యేసు యొక్క కార్యాన్ని జరిగించడం - అని ఆ పదానికి అర్థం. శృంగారపు దేవాలయపు ద్వారము వద్ద కూర్చుండి భిక్షమడుగు నలభై ఏండ్ల ఈడుగల పుట్టు కుంటి వానిని - నజరేయుడైన యేసు నామమున నడువుమని పేతురు వాని స్వస్థపరచిన తరువాత - యూదా మతాధికారులు పేతురు యోహానులను దాని విషయమై విచారించినపుడు ఈ పద భావం వివరించబడింది. "వారు ప్రేతురును యోహానును మధ్వను నిలువబెట్టి - మీరు ఏ బలముచేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని" అడిగారు (అపో 4:7), మీకు ఈ శక్తి ఎక్కడనుండి వచ్చింది, మీకు ఈ అధికారమిచ్చినవాడెవడు అనేది వారి ప్రశ్నకు అర్థం.

Comments
Post a Comment