పరిచారము చేయుట, చెప్పుట

#పరిచారము_చేయుమని_చేయుట,
#పరిచారము_చేయుట.

మత్తయి 23:2-7
#శాస్త్రులును_పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు
గనుక వారు మీతో చెప్పువాటి నన్నిటిని అనుసరించిగై కొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; #వారు_చెప్పుదురే_గాని_చేయరు.
మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని #తమ_వ్రేలితోనైన_వాటిని_కదలింపనొల్లరు.
మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు;
విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను
​సంత వీధులలో వందన ములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు.

#యేసు_పరిచారము_చేయుమని_చెప్పుట!

మీలో ఆలాగుండ కూడదు. మీలో ఎవడైనను #గొప్పవాడై యుండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయువాడై యుండవలెను.
మీలో ఎవడైనను #ప్రముఖుడై యుండగోరిన యెడల, వాడు అందరికి #దాసుడై యుండవలెను.
మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని #పరిచారము_చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.
మార్కు 10:43-45

#యేసు_తాను_చెప్పినదాన్ని_చేయుట!

భోజన పంక్తిలోనుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని #నడుమునకు_కట్టుకొనెను. అంతట పళ్లెములో నీళ్లు పోసి #శిష్యుల_పాదములు_కడుగుటకును, తాను కట్టుకొనియున్న తువాలుతో #తుడుచుటకును మొదలుపెట్టెను.
ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను.
అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా..
యోహాను 13:4-7

★పౌలు తాను క్రీస్తునుండి నేర్చుకున్నదే తన జీవితములో నిర్వర్తించుట!

వారు క్రీస్తు #పరిచారకులా? వెఱ్ఱివానివలె మాటలాడుచున్నాను, #నేనును_మరి_యెక్కువగా_క్రీస్తు_పరిచారకుడను. మరి విశేషముగా #ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని....
2కోరింథీయులకు 11: 23.

★అపొస్తలుడైన యోహానుతో దూత...

యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా,
అతడు వద్దుసుమీ, నేను #నీతోను, ప్రవక్తలైన నీ #సహోదరులతోను, ఈ గ్రంథ మందున్న #వాక్యములను_గైకొనువారితోను_సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.
ప్రకటన గ్రంథం 22:8-9

Comments