పాప క్షమాపణ చట్టం

🎉 *పాప క్షమాపణ చట్టం* 💐

ప్రతీ  మానవుని జీవితంలో పాప క్షమాపణ అత్యంత ప్రాముఖ్యమైనది. ప్రాధాన్యమైనది.

ప్రతీ ఒక్కరికీ పాపక్షమాపణ చట్టం తెలుసుండాలి. లేనిచో పరిశుద్దుడైన దేవునితో కలిసి యుండటం అసాద్యం

👉నీవు చేసిన పాపమేమిటి..?
👉నీకు పాప క్షమాపణ జరిగిందా..?
👉నిన్ను క్షమించినవారెవరు..? క్రీస్తా..? దేవుడా..?
👉పాప క్షమాపణ పొందిన తర్వాత ఒకవేళ కాలుజారితే..?
వంటి విషయాలు తప్పక తెలుసుకోవాలి.

*పాపక్షమాపణ చట్టాలు 2*

*1.క్రీస్తులో లేనివారికి - పాపక్షమాపణ చట్టం..*

యేసుకు పాపాలు క్షమించే అధికారం ఉంది. (మార్కు2:9)

యేసు భూలోకంలో జీవిస్తూఉన్న రోజుల్లో అనేకమంది పాపములు క్షమించెను. (లూకా7:47, యోహా8:7-11)

మొదటినిబంధనా కాలంలో జరిగిన అపరాధములకు (విశ్వాసులై, కాలు జారితే, వారికొరకు) కూడా ఆయన మరణం పొందెను. (హెబ్రి9:5)

1. పాపములు క్షమించే అధికారం దేవునిది. (మత్త18:35)
2. ఆ అధికారం క్రీస్తుకు అప్పగించాడు.
3. క్రీస్తు అపోస్తలులకు అప్పగించాడు. (యోహా 20:23, కొర్నేలి విషయంలో పేతురు వినియోగింపబడ్డాడు. అపో 10 అధ్యా.)
*4. నేడు పాప క్షమాపణ జరగాలంటే అపోస్తలుల బోధ వినాలి.*(అపో 2:36-38, రోమా6:16-18) *మరో దారి లేదు*

*2. రెండవ పాపక్షమాపణ చట్టం - క్రీస్తులో ఉన్నవారు తప్పు చేస్తే..???*

1.ఆయనతో సహవారం గలవారమని చెప్పుకొని చీకటిలో నడచిన యెడల మనము అబద్దికులం. ఆయన వెలుగులో నడచిన ప్రకారం మనమూ వెలుగులో నడవాలి.  *ఆయనతో అన్యూన్య సహవాసం కలిగి యుంటే,* *అప్పుడు యేసు రక్తం ప్రతీ పాపంనుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది.* (1యోహా1:5-8)

2. మనము *మన పాపంలను ఆయన దగ్గర ఒప్పుకోవాలి.* *అపుడు ఆయన మన పాపాలు క్షమించి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును.*
(1యోహా 1:9-10)

3. నీలో క్షమాబుద్ది ఉండాలి. నీ సహోదరుని 77 సారులైనా క్షమించాలి, క్షమించే బుద్ది నిర్విరామంగా కొనసాగించాలి, (మత్త18:21,35 )
*మన సహోదరులని హృదయపూర్వకముగా క్షమించాలి,*  *అపుడు పరలోకపు తండ్రియూ ఆప్రకారమే క్షమించును.*

*క్షమాపణ లేని తప్పులు*

బుద్ది పూర్వకంగా పాపం చేసినా,
సాహసించి పాపం చేసినా,
తెగించి తప్పుచేసినా,
ఉద్దేశ్యపూర్వకంగా పాపం చేసినా,
pre planned గా పాపం చేసినా, పాపక్షమాపణ లేదు. (హెబ్రి 10:26)

పరిశుద్దాత్మకు
వ్యతిరేఖంగా మాట్లాడినా,
విరోధంగా మాట్లాడినా,
వ్యతిరేఖంగా పాపంచేసినా, పరిశుద్దాత్ముని దూషించినా, క్షమాపణ లేదు. (మత్త12:31-32, మార్కు3:29, లూకా 12:10)

Comments