యేసు కూడా దేవునిని ఆరాధిస్తాడు*

*యేసు కూడా దేవునిని ఆరాధిస్తాడు*

ఇది నిజమా..?
వాక్య పరిశీలన చేద్దాం..!!

👉యేసు కూడా ఆరాధనకు వస్తాడు
👉 ఆరాధనలో 3 పనులకోసం వస్తాడు.

*1. మొదటిపని:-*
*సంఘములో దేవుని కీర్తిని గానము చేయుటకు క్రీస్తు ఆరాధనకు వస్తాడు*
హెబ్రీయులకు 2:11,12
పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే(లేక, ఒక్కడే) మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, *సమాజము మధ్య (లేక, సంఘము మధ్య) నీ కీర్తిని గానము చేతును* అనెను.

*2. రెండవ పని:-*
*భోజన బల్ల యొద్ద మనతో సహవాసం కొరకు యేసు వస్తాడు*
మొదటి కొరింథీయులకు 10:16,17,18
మనము దీవించు ఆశీర్వచనపు (గిన్నె) పాత్రలోనిది(లేక,మనము స్తుతించు స్తుతి పాత్రలోనిది) త్రాగుట *క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా?* మనము విరుచు రొట్టె తినుట *క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయే గదా?*
మనమందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన *మనము ఒక్క శరీరమైయున్నాము.*
శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. *బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా?*
👉ప్రభువు బల్ల వద్ద ఆయనతో పాలివారమౌతున్నాం.
👉క్రీస్తుకు మనకు గల సంబంధం రక్తసంబంధం.
👉మనము ఆయనకు అతిధులం.
👉యేసుతో సహవాసం చేస్తున్నాం.
👉ఒకే తండ్రి బిడ్డలం.
👉ఒకే రక్తానికీ, ఒకే బీజానికి చెందినవారం.
👉క్రీస్తు శరీరంలో సాటి అవయవాలమై చేస్తున్నాం
*ఈ కార్యక్రమం యేసు లేకుండా జరగదు.*

*3. మూడవ పని:-*
*మనతో కలిసి క్రీస్తు దేవునిని ఆరాధన చేస్తాడు.*

👉యేసు మన ప్రధాన యాజకుడు. (హెబ్రి7:26)
👉మనం యాజకులం. (ప్రక1:6)
అందరూ కలిసి దేవునిని ఆరాధించాలి. అది నియమం.

👉ప్రధాన యాజకుడు ఆరాధనకు పాత్రుడు కాదు.
👉ఆయనకు ఆరాధన చెయ్యకూడదు.
👉ప్రధానయాజకుని ద్వారా దేవుని సముఖానికి వెళ్ళడం అనేది దేవుని అభీష్టం.
👉యేసు నిరంతర ప్రధానయాజకునిగా నియమింపబడ్డాడు. (హెబ్రి7:22-24)

👉అందువల్ల మనం యేసును ఆరాధించకూడదు.
👉క్రీస్తుకు ఆరాధన చెయ్యకూడదు.
👉యేసు తనను ఆరాధించమని ఎప్పుడూ ఎన్నడూ కోరలేదు.

👉తండ్రిని ఆరాధించాలి. ఇది తండ్రి కోరుకున్నాడు.
(యోహా 4:23-24)

👉 యేసును సేవించాలి.
ఇది యేసు యొక్క కోరిక.
(యోహా12:26)
⚠➡ క్రీస్తు చెపిన ఆజ్ఞలను గైకొనడమే క్రీస్తుని సేవించినట్లు.. తండ్రిని ఆరదించమని క్రీస్తు చెపినడు అలా చేయడమే క్రీస్తుని సేవించునట్లు.

👉ఎవరు కోరినది వారికి ఇవ్వాలి. ఇది మన ధర్మం, కర్తవ్యం.

మనతో కలిసి యేసు - తండ్రిని ఆరాధించడానికి వస్తాడు. నమ్మ మనసు ఉంటే..అంగీకరించుము.

మరిన్ని ఆత్మీయ పరిష్కారముల కొరకై
మీ దగ్గరలోని క్రీస్తుసంగమును సంప్రదించగలరు.

Comments