దుష్ట సాంగత్యం

🌹💐 *దుష్ట సాంగత్యము* 🌹💐
👉సాంగత్యము అంటే సహవాసం, స్నేహము, చేరిక, కూడిక అనే అర్థాలు వస్తాయి.
👉దుష్ట సాంగత్యము చాలా చెడ్డది, భయంకరమైనది
👉ఎంతటి జ్ఞానవంతుడునైన, ఎంతటి బలవంతుడనైన పడవేస్తుంది
👉దుష్ట సాంగత్యము మంచినడవడిని చెరిపి వేయును *1కొరింథి15:33*
👉సమాజంలో 90% మంది చెడిపోవటానికి ప్రధాన భూమిక వహించేది దుష్ట సాంగత్యం
👉సొలొమాను ఈ సమాజానికి అద్భుతమైన మాటను తెలియజేశాడు "వేశ్యలతో సాంగత్యము చేస్తే  ఆస్తిని పాడు చేసుకొంటారు" అని తెలియజేశాడు *సామెతలు29:3*
👉వేశ్యతో సాంగత్యం చేస్తే రొట్టె తునక మిగులుతుంది *సామెతలు6:26*
👉చాలా మంది వీళ్ళతో సాంగత్యం చేసి ఆస్తిని పోగొట్టుకుంటున్నారు, ఆరోగ్యం పాడు చేసుకొంటున్నారు.
👉కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది అంటే కారణం దుష్ట సాంగత్యం. పిల్లలు చెడిపోతున్నారు అంటే దుష్ట సాంగత్యం
👉ఆ మధ్య ఒక పాఠశాలలో పిల్లలు డ్రగ్స్ కు అలవాటు పడ్డారంటే హేతువు దుష్ట సాంగత్యం.

🌹 *దుష్ట సాంగత్యం సొలొమానును పడవేసింది..*
👉సొలొమాను జ్ఞానానికి ప్రతీక. భూమి పుట్టింది మొదలుకొని సొలొమాను లాంటి జ్ఞానవంతుడు ఎవ్వరు లేరని గ్రంధం చెప్పింది *1రాజులు 3:12*
👉అంతటి జ్ఞానవంతుడు కేవలం దుష్ట సాంగత్యం చేసి పడిపోయాడు.
👉మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో *సహవాసము* చేయకూడదనియు, వారిని మీతో *సహవాసము* చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి.. *1రాజులు11:1*
👉సొలొమాను దగ్గర ఉన్నటువంటి స్త్రీలు అతని హృదయాన్ని త్రిప్పివేశారు *1రాజులు11:3*
👉అంతేకాకుండా వాళ్ళ దేవతలకు సొలొమాను బలిపీఠాలు కట్టించాడు *1రాజులు11:7*
👉సొలొమాను అలా చేయడానికి ప్రధానమైన కారణం *అన్య స్త్రీల సహవాసం*
👉యెహోవా దృష్టికి సొలొమాను చెడునడత నడిచాడు
👉 తన తండ్రియైన దావీదు వలె అతని హృదయం ఉండకుండా తప్పిపోయింది *1రాజులు11:6*
👉ఇశ్రాయేలీయుల రాజుకు Law(ధర్మశాస్త్రం) ఏమి చెప్పిందంటే అనేక మంది స్త్రీ లను వివాహం చేసుకొంటే మీ హృదయాలను త్రిప్పి వేస్తారు గనుక ఎక్కువ మందిని వివాహం చేసుకొనకూడదు అని తెలియజేసింది
👉లేవీయుల దగ్గర ఉన్నటువంటి ధర్మశాస్ర్తాన్ని జిరాక్స్ చేసుకొని దానిని బ్రతుకు దినములన్నిట చదువుతూ, దాని ప్రకారంగా నడుస్తూ కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు అని దేవుడు తెలియజేశాడు *ద్వితీ17:15-20*
👉చివరికి సొలొమాను ధర్మశాస్ర్తాన్ని ఉల్లంఘించి, దేవుని శాసనాలు అనుసరించకుండా అన్య స్త్రీలతో సహవాసం చేసి పడిపోయాడు..
👉సొలొమాను ఎంతటి జ్ఞానవంతుడు??? భూ ప్రపంచంలో అలాంటి జ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నారా??? అలాంటి జ్ఞానవంతుడు పడిపోవడానికి కారణం దుష్ట సాంగత్యం.. దుష్ట సాంగత్యం ఎంతటి జ్ఞానవంతుడినైన పడవేస్తుంది.

🌹 *దుష్ట సాంగత్యము*
 *సమ్సోనును పడవేసింది..*
👉సమ్సోను దేవుని కోసం నాజీరు చేయబడిన వ్యక్తి
👉అతడు న్యాయాధిపతి.
 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేశాడు *న్యాయాధిపతులు16:31*
👉మహా బలము కలిగినవాడు. బొబ్బరించుకుంటూ వస్తున్న సింహాన్ని ఒకడు మేకపిల్లను చీల్చివేసినట్లుగా ఆ కొదవ సింహాన్ని చీల్చి వేశాడు. *న్యాయా14:5-6*
👉300 నక్కలను పట్టుకొని, ఆ నక్కల తోకలకు మంట పెట్టి వాళ్ళ బద్ద శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల పంటపొలాల్ని తగలపెట్టాడు *న్యాయాధి15:4-5.* 300 నక్కలను పట్టుకోవాలంటే ఎంత శక్తి సామర్ధ్యాలు కావాలి?
👉ఆయుధం లేకుండా 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చిన వాడు సమ్సోను *న్యాయాధి 15:15*
👉1000 మందిని చంపాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి?
👉ఒక్క ఆయుధం కూడా లేకుండా ఒంటి చేత్తో 1000 మందిని మట్టి కరిపించాడంటే ఎంతటి వీరుడో.
👉ఇలాంటి ధీరుడు, వీరుడు, శౌర్యము కలిగిన వాడు దుష్ట సాంగత్యం వలన పడిపోయాడు. దేలీల అనే వేశ్య సహవాసం చేసి తన బలాన్ని పోగొట్టుకున్నాడు *న్యాయాధి16:1-31.*
👉 దేవుని కోసం ప్రత్యేకింపబడిన వాడు, మహాబలము కలిగిన వాడు, న్యాయాధిపతి అయినటువంటి వాడు కేవలం దుష్ట సాంగత్యం వలన శత్రువుల చేతిలో చిక్కి, కళ్ళు ఊడపీకించుకొని, జైల్లో కూర్చొని తిరగాలి విసురుతున్నాడు
👉సమ్సోను ఎంతటి బలము కలిగిన వాడు??? అతని శక్తి సామర్ధ్యాలు వలన ఆనాటి ఫిలిష్తీయులు గజగజ వణికిపోయారు. అలాంటి వాడు పడిపోయాడంటే దుష్ట సాంగత్యం.
👉ఎంతటి జ్ఞానవంతుడునైన, ఎంతటి బలము కలిగిన వాడినైన దుష్ట సాంగత్యము పడవేస్తుంది.

🌹 *సహవాసాన్ని గూర్చి యెహోషువా విశేషమైన హెచ్చరిక..*
👉ఆదర్శవంతమైన కుటుంబ నాయకుడుగా పేరొందినవాడు యెహోషువా
👉దేవుని యొక్క పనిని తన భుజస్కందాల మీద మోసినవాడు యెహోషువా
👉అబ్రాహాముకి దేవుడు కనాను దేశాన్ని నీ సంతతికి ఇస్తానని వాగ్దానం చేశాడు *ఆది కాండము 13:7*
👉ఇశ్రాయేలీయుల్ని కనాను దేశానికి తీసుకొనిపోవడంలో ప్రధానపాత్రవహించాడు
👉తిరుగులేని విశ్వాసవీరుడు
👉మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు గాని నేను నాకుటుంబము యెహోవాను సేవిస్తామని సవాల్ విసిరాడు
👉 దేవుని పని పట్ల తీవ్రత కలిగి ఉన్నవాడు.
👉యెహోషువా బహు వృద్ధుడైన తరువాత ఇశ్రాయేలీయుల పెద్దలను, ముఖ్యులనులను, న్యాయాధిపతులను, నాయకులను పిలవనంపించి ఒక మీటింగ్ పెట్టి ఆ సమావేశంలో 3 విషయాలను గూర్చి తెలియజేస్తున్నాడు
 *1)ధర్మశాస్త్రాన్ని గైకొనుటలో తప్పిపోకూడదు*
 *2) విగ్రహాలను పూజించకూడదు*
 *3)వివాహ వ్యవస్థ గూర్చి తెలియజేశాడు యెహోషువా23:1-13*
👉మీ చుట్టూ ఉన్న అన్య జనులతో వియ్యమంది, వారితో మీరును మీతో వారును *సాంగత్యము* చేస్తే భవిష్యత్ చాలా దారుణంగా ఉంటుంది అని తెలియజేశాడు.
👉 *వాళ్ళతో సాంగత్యము చేస్తే వారు మీకు ఉరి గాను బోను గాను, మీ ప్రక్కల మీద కొరడాలు గాను, మీ కన్నులలో ముళ్లుగాను ఉంటారు.*  అని యెహోషువా తన చివరి ప్రసంగంలో ఇశ్రాయేలీయుల వారికి సాంగత్యము గూర్చి  విశేషమైన హెచ్చరిక చేశాడు..
👉అన్య జనులతో సాంగత్యం చేస్తే వాళ్ళ క్రియలు మనం నేర్చుకుంటాం. వాళ్ళ ఆచారాలల్లో మనం పడిపోతాము. *కీర్తనలు106:35*

Comments

Post a Comment