నిజమైన స్నేహితుడు

✳ *నిజమైన స్నేహితుడు*  ✳

యోహా 15:14
*నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు "నా స్నేహితులై "యుందురు.*

👉ఒంటరితనం రెండు విధాలు.
🔹 *భౌతికమైన ఒంటరితనం (కుటుంబ సభ్యుల ద్వారా పోవును.)*

🔹 *అంతరంగ ఒంటరితనం  "స్నేహితుల" ద్వారా పోవును.*
👉అన్ని బంధాల కంటే గొప్ప బంధం స్నేహ బంధం.

ఇతర పదాలు – *మైత్రి, సావాసం, చెలిమి, స్నేహం.*

♻ *ప్రాణము పెట్టువాడు మాత్రమే నిజస్నేహితుడు.*
 ఉదా: (యేసు)

♻ *ప్రాణము తీయువాడు కపటస్నేహితుడు*
 ఉదా :(సాతాను) యూదా.

♻ *దేవుడు మాత్రమే నిజ స్నేహితుడు.*

🔺 *దేవుడు అబ్రహామునకు స్నేహితుడు.*
2 దిన 20:5-7, యెషయ 41:8, యాకోబు 2:23.

ఇద్దరు స్నేహితులు కలసి పనిచేస్తే కలిస్తే మంచి ఫలము కలుగు తుంది. ఒకరి కొకరు సాయంగా ఉండగలరు. ప్రసంగి 4:9 ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు..

🔹 *నిజస్నేహితుడు తగ్గింపు మనస్సు కలిగి యుండాలి*
 Luk 14:8 నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండ వద్దు; ఒకవేళ నీకంటె ఘనుడు అతని చేత పిలువబడగా Luk 14:9 నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గు పడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. Luk 14:10 అయితే   నీవు పిలువబడి నప్పుడు, నిన్ను పిలిచినవాడు వచ్చిస్నేహి తుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము.

Pro 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగు నప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.   Joh 15:15  ఇక మిమ్మును దాసులని పిలువక *స్నేహితులని* పిలుచుచున్నాను.

*స్నేహం గురించి కొన్ని హెచ్చరికలు:*

1⃣ *స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలి.*
 సామె 22:24- 25 కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము 25 నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.

2⃣ *చెడ్డ స్నేహం మనలను కూడా చెడగొడుతుంది.*
 1కోరి 15:33 మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.

3⃣ *ప్రతిదానికి స్నేహితులమీద ఆధారపడకూడదు.*
 సామె 25:17 మాటిమాటికి నీ పొరుగువాని యింటికి వెళ్లకుము

4⃣ *స్నేహితులను విసిగించ కూడదు.*
 సామె 25:17 మాటిమాటికి నీ పొరుగువాని యింటికి వెళ్లకుము అతడు నీవలన విసికి నిన్ను   ద్వేషించునేమో.

5⃣ *స్నేహితుల గురించి బయట చెడ్డగా మాట్లాడరాదు. అది స్నేహాన్ని దెబ్బదీయును.*
 సామె 16:28 .... కొండెగాడు మిత్రభేదము చేయును.

6⃣ *స్నేహితులకు నమ్మక ద్రోహం చేయరాదు. అట్టివారు విరిగిన కాలు, విరిగిన పన్నుతో సమానం.*
 సామె 25:19  ఉదా: యూదా ఇస్కారియోతు

7⃣ *స్నేహితుల మనస్సులకు బాధ కలిగించి “నవ్వులాటకు” అని చెప్పరాదు.*
 సామె 26:19 తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసితినని పలుకువానితో సమానుడు.

*నిజ స్నేహితుడైన యేసు ద్వారా కలుగు 10 మేలులు:*

1⃣ *మేలు కోరువాడు*
 సామె 27:6 మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును.

2⃣ *సంతోష పరచువాడు*
 యోహాను ౩:29 నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని  మిక్కిలి సంతోషించును సామె 27:9 తైలమును అత్తరును హృదయమును సంతోష పరచునట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన  మాటలు హృదయమును సంతోష పరచును. (దేవుని మాటలు)

3⃣ *ముఖాముకిగా మాటలాడువాడు*
 దాపరికము లేనివాడు ఉదా1  : నిర్గ 33:11 దేవుడు – మోషే , ఉదా2. దేవుడు – అబ్రహాము  ఆదికాండం 18:17 అప్పుడు యెహోవానేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా?

4⃣ *ప్రేమించువాడు*
 యోహాను  15:13 తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. సామె 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.

5⃣  *బుద్ధి (వివేకము) కలిగించువాడు*
 – సామె 27:17 ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఆ వివేకముగల మాటవినువాడు స్నేహితుడు ఉదా1 : అబ్రహాము ఉదా2: మోషే ఉదా ౩ బాలుడైన సముయేలు

6⃣ *ప్రాణానికి దగ్గరగా ఉండువాడు – సన్నిధిని సమయమును ఇచ్చువాడు*
 (క్లోజ్ ఫ్రండ్ -  ప్రాణ స్నేహితుడు-లోబడువాడు) సామె 18:24 బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహి తుడు కలడు.
ఉదా 1:  యోనాతాను 1సమూ  18:1 దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు... యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు  ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. 1సమూ  20:17

7⃣ *నమ్మకము కలిగినవాడు*
  ఉదా: దేవుడు – అబ్రహాము యాకోబు 2:23 (అబ్రహాము దేవుని నమ్మెను - దేవుని స్నేహితుడుగా మారెను.) ఉదా: దేవుడు మాత్రమే నమ్మదగినవాడు (విశ్వాస్యత)

మనుష్యులు నమ్మదగనివారు 2 తిమో 2:13

ఈ లోక స్నేహితులు నమ్మదగిన వారు కారు.

8⃣ *పరిచర్య (సహాయం) చేయువాడు*
  యోహాను 15:14 నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు. ఉదా1 : అర్దరాత్రి స్నేహితుడు లూకా 11:8

9⃣ *ప్రార్ధించువాడు*
 ఉదా యోబు 42:10 మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము  ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.

🔟 *సంఘ సహవాసం*
కీర్త 119:63 నీయందు భయభక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించు వారికిని నేను చెలి కాడను. సామె 13:20 జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవా డగును.  

ముగింపు :

*సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన యేసు మాత్రమే మన నిజ స్నేహితుడు.*

Comments