క్రైస్తవులలోని కొందరు విశ్వసిస్తున్న నుదిటి వ్రాతలు(తల రాతలు) వాక్యానుసారమా???...

✳ *క్రైస్తవులలోని కొందరు విశ్వసిస్తున్న నుదిటి వ్రాతలు(తల రాతలు) వాక్యానుసారమా???...✍*

🙏ప్రభువు నామములో మీకు మరియు మీ కుటుంబమునకు మీకు శుభములు తెలియజేస్తున్నాను.

👉 భూమి మీద ఒక వ్యక్తి తక్కువ వయస్సులోనే చనిపోయినా, తక్కువ కులంలో పుట్టినా, కడు పేద కుటుంబములో జన్మించిన, ఆడవారిగా జన్మించి కష్టాలు పడుతున్నా, తను కోరుకున్నది నెరవేరకపోయిన వీటి అన్నిటికి కారణము మన
*“ నుదిటి మీద రాతే(తల రాతే) అన్న భావన ప్రజలలో నాటుకుపోయింది.*

👉 ఒక నూతన జంట వివాహము తరువాత విహార యాత్రకు బయలుదేరినప్పుడు driver నిర్లక్షం వల్లనో, మితి మీరిన వేగం వల్లనో ప్రమాదము సంభవించి వరుడు మరణిస్తే ఆ మరణించిన వరుడి తల్లికి ఒకే బిడ్డ అయితే ఆ తల్లి తన బిడ్డ శవం ముందు కుర్చుని పలికే రోదన ధ్వనులలో ఎక్కువ శాతం దేవుడినే ధుషిస్తూ ,శాపనార్ధాలు పెడుతూ –

👉 *దేవుడా.......లోకములో ఇంత మంది బిడ్డలుండగా నీకు నా బిడ్డే కనిపించాడా?? అన్యాయముగా నా బిడ్డను పొట్టన పెట్టుకున్నావు కదయ్యా* అని అంటూ విధవరాలుగా మారిన నవ వధువును ఉద్దేశించి
👉 *“””” నీ రాత బగలేదమ్మా ,ఇది దేవుడు రాసిన రాతే ,విధి వ్రాతను తప్పించుకోవడము ఎవరి తరం గాదు* అనే మాటల సందర్భాన్ని మనము గమనించొచ్చు.

👉 *ఒక్కొకరికి ఒక్కో రకమైన తల రాతను దేవుడు వ్రాస్తాడా???????*

👉 *ఒక వేళ అలా వ్రాస్తే దేవుడు పక్షపతి అవ్వుతాడు.*

 👉 *ఒకడు పేదరికములో పుట్టాలని, ఒకడు సంపన్న కుటుంబములో పుట్టాలని దేవుడు ఏర్పాటు చేస్తాడా?????*

👉 *ఒకడు చెడ్డవాడుగా, ఇంకొకడు మంచివాడుగా బ్రతకాలని దేవుడే నియమిస్తాడా????*

 👉ఇలా అయితే దేవుడు పక్షపాతిగా వ్యవహరించినట్లు. కానీ దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో చూస్తే

1⃣ *అపోకార్య 10:34- అందుకు పేతురు నోరు తెరిచి ఇలా అనెను-దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను.*

👉ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా నేను గ్రహించాను అని అంటున్నాడు.

2⃣ *వృత్తిలో మార్పులు ,చేర్పులకు దేవుని రాతకు సంభందము లేదని, మన జీవన స్థితిగతులను దేవుడు నిర్ణయించడని, అది వారి వారి పూర్వికుల పరిస్థితిని బట్టి ప్రదేశాలను బట్టి ఆసక్తిని బట్టి ఉంటుందని అర్థము చేసుకోవచ్చు.*

👉దేవుడు సమానంగా అన్ని కల్పించాడు. కానీ వాటి వినియోగములోనే మనకు వ్యత్యాసము కనిపిస్తుంది.
🔺 అందరికి ఉపకారము చేయాలన్న దేవుని లక్షణము చూస్తే

*కీర్తన 145:9- దేవుడు అందరికి ఉపకారి అని ఉంది..*

👉 దేవుడు కొందరికే ఉపకారి కాదు. ఆయనలో పక్షపాతి స్వభావము లేదు.

👉 *మత్తయి 5:45-అయన చెడ్డవారి మీదను, మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి ,నితిమంతుల మీదను, ఆ నితిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు.*

3⃣ *ఇంతకు దేవుడు నుదిటి పై వ్రాత వ్రాసాడంటారా???*
దేవుడు వ్రాసుకున్నది నుదిటి మీదేనా అని

👉 *బైబిల్ లో చూస్తే నుదిటి మీద హ్రత  రాయడు*

👉 ఈ సంగతి అర్థమైతే ఎన్నో చిక్కు ముడులు విప్పబడుతాయి.

👉 *నుదిటి రాత అంటున్న వారికీ నుదుటిపై ముడతలు తప్ప ఏమి కనిపించవు. ఏ భూతద్దంతో వెతికిన –చర్మపు ముడతలు. స్వేద రంధ్రాలు తప్ప వ్రాత దొరకదు.*
🔺 ఒక వేళా ఉందని కాసేపు అనుకున్న
🔺అయన వ్రాసిన వ్రాత వీరికి అర్థం అవుతుందా????
🔺ఇంతకు ఏ భాషలో ఉంది ఈ వ్రాత???

👉 *దీనిని బట్టి ఎవ్వరు నుదిటిపై వ్రాత లేదు అని సామాన్యముగా అర్థము చేసుకోవచ్చు.*

👉 ఇంతకు దేవుడు వ్రాసుకున్నది నుదిటి మీదేనా అని బైబిల్ లో చూస్తే

*హెబ్రీ 10:7-అప్పుడు నేను- గ్రంధపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం..... అంటే దేవుడు మన గురించి వ్రాసుకున్నది గ్రంధపు చుట్టలో అని చెప్పబడింది*

👉 కానీ నుదిటి మీద కాదు అని అర్థమయింది.

 *కీర్తన 139:16-నియమింపబడిన దినములలో ఒకటైనాను కాకమునుపే నా దినములన్నియు( నా భవిష్యత్తు ) నీగ్రంధములో లిఖితములాయేను.*

👉ఇక్కడ కూడా అదే విషయం ప్రస్తావించాడు. అనగా మన future దేవుని గ్రంధములో వ్రాయబడింది. పై రెండు వచన సందర్భాలు(హెబ్రీ 10:7, కీర్తన 139:16)
👉ఒకటి క్రీస్తు గురించి,
👉మరొకటి దావీదు గురించి అని అనుకుని ,
👉నా గురించి
 మాత్రము ఏమి వ్రాయలేదు అని అనుకోకండి.

*దేవుడు ఆలోచన తన పిల్లలపై ఉన్నతంగా ఉంటుంది.*

👉 కానీ దేవుడు అందరి గురించి వ్రాసుకున్న ఒకే రాత(ఒక్కొకరికి ఒక్కో రాత కాదు) ఏమిటో bible లో చూద్దాము.

*ఎఫేసి 1:4-6- మనము దేవుని ఎదుట పరిశుద్దులముగా ,నిర్దోషలముగా బ్రతకాలని జగత్తు పునాది వేయబడక మునుపే నిర్ణయించి వ్రాసుకున్నాడు.*

👉 దేవుడు వ్రాసుకున్న ఉన్నతమైన వ్రాత ఏమిటంటే పరిశుద్దుడిగా ,నిర్దోషిగా బ్రతకడం .
👉మిగతావి అన్ని దేవుని చిత్తప్రకారం చేస్తే అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. బైబిల్ చదవండ.

👉ఇంతకు మనము ఏ పనులు చేసి పరిశుద్దముగా ,నిర్దోషిగా బ్రతకమని దేవుడు వ్రాసుకున్నాడో బైబిల్  లో చూస్తే

*ఎఫేసి 2:10- వాటి యందు మనము నడుచుకోనవలెనని దేవుడు ముందుగా సిద్దపరచిన సత్ క్రియలు ( వాక్యపు పనులు) చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టించబడిన వారమై ,అయన( దేవుడు) చేసిన పనియై యున్నాము.*

👉 మనము చేయవలసిన వాక్యపు పనులు( వాక్యానుసారమైన జీవితము జీవించాలని) వ్రాసుకున్నాడు.

*దేవుడు సిద్దపరచిన సత్ క్రియలను మనము చేయాలి కానీ అయన మనతో చేయించడు.*

🔹సమాజములో అవకాశవాదులు తాము అనుకున్నది సాదించుకుంటే “తమ గొప్ప” అని చెబుతారు.
🔸కానీ అనుకున్నది సాదించుకోలేకపోతే “ దేవుని రాత అని తప్పించుకుంటూ ఉంటారు.
🔹ఉదా:: సంతానము కలిగేటప్పుడు మగ పిల్లవాడు పుడితే –నేను చెప్పినట్లే మగ పిల్లవాడు పుట్టాడు చూసారా అనే అని అంటారు.
🔸అనుకోని విధముగా ఆడపిల్ల పుడితే ఏమి చేద్దాము, దేవుడు రాసిన రాత ఎవ్వరు తప్పించలేరు అని అంటారు.
🔹అలాగే bike racing పోటిలలో మితి మీరిన వేగంతో bike నడుపుతూ ,పోటిలలో గెలిస్తే చూసారా నా power అని అంటాడు.
🔸అనుకోని ప్రమాదము జరిగి leg,hand విరిగితే దేవుడు ఇలా రాసి పెట్టాడు అని అంటారు..
👉handle మన చేతుల్లో ఉందా?? దేవుని చేతుల్లో ఉందా ఆలోచించండి...

4⃣ *దేవుడు అందరికి ఉపకారి అయినప్పుడు ఒకరికి చెడు జరగాలని, చెడుగా బ్రతకాలని దేవుడు ఆదేశిస్తాడంటారా???*

👉ఒక్క మాటలో చెప్పండి- మద్యం సేవించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోమని దేవుడు రాత రాస్తాడంటారా?????
👉 ఉన్న భార్యను వదిలి రెండో పెళ్ళికి సిద్దమవ్వమని దేవుడు రాత రాస్తాడంటారా??
👉 మితి మీరిన వేగముతో వాహనమును నడిపి ప్రమాదము కొని తెచ్చుకోమని దేవుడు నుదిటిపై లిఖించాడంటారా?????

🔺 ఇవన్ని మనము చేసుకుంటున్న వివిధమైన స్వయము పనులు. దేవుడు ఇలా బ్రతకమని ఎప్పుడు చెప్పడు. చేయించడు.

5⃣ *ప్రసంగి 7:29- దేవుడు నరులను యదర్ధవంతులుగా పుట్టించెను గానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొనియున్నారు.*

👉 అనగా దేవుడు మనిషిని యదార్థవంతంగా పుట్టించాడు,
 👉యదార్ధవంతుడుగా ,
పరిశుద్దుడుగా, నిర్దోషిగా వాక్యపు పనులతో బ్రతకమని తన గ్రంధములో వ్రాసుకున్నాడు.

*మనము ప్రయత్నము చేస్తే దేవుని తోడ్పాటు ఉంటుంది.*

🔺అంతే తప్ప ప్రయత్నము ఏమి చేయకుండా, అయన రాసినట్లు జరగకుండా మానదు అని ఇంట్లో కూర్చుంటే ముద్ద కంచంలోకి రాదు.
కనుక
*ప్రతి పనికి మన ప్రయత్నము అవసరం.*

🔺ఈ విధముగా
*పని విషయమై ప్రయత్నము చేయమనేదే దేవుని చిత్తము*
🔺కానీ నేడు అందరు దేవుని చిత్తమైతే చేస్తాను, చూస్తాను, వస్తాను, కొంటాను, ఇస్తాను అని వారికీ తెలియకుండానే నుదిటి రాతపై నమ్మికయుంచుతున్నారు.

 6⃣ *దేవుడు రాసుకున్న విధముగా నడిచి చూపిన యేసుక్రీస్తు ఉన్నాడు.*

*దేవుని గ్రంధపు చుట్ట్టలో రాసుకున్న వ్రాతకు బిన్నముగా ప్రవర్తించి దేవుడు ఏర్పరిచిన మార్గము నుంచి తప్పిపోయిన యుధా ఉన్నాడు.*

*మత్తయి 26:24- ఈ సందర్బ్భాములో దేవుడు క్రీస్తును గురించి వ్రాసుకున్నట్లు క్రీస్తు పోవుచున్నట్లు గమనించగలం*
👉వ్రాయబడిన ప్రకారం దేవుడే జరిగించడం లేదు గానీ కరిస్తే అలాగున వెళ్లుచున్నాడు. దేవుడు దీనికి సహకరిస్తూన్నాడు.

*ప్రయత్నము క్రిస్తుది.సహాయము దేవునిది.*

👉వ్రాయబడిన ప్రకారము అనగా
▪పరిశుద్దులముగాను, నిర్దోషులముగాను బ్రతకాలి,
▪శ్రమలు అనుభవించాలి.
▪ఈ విధముగా క్రీస్తు తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి ,
▪తండ్రి సిద్దపరచిన పనిని ఉన్నదున్నట్లు సంపూర్తి చేశాడు.
▪ఈ మార్గములో క్రీస్తు తనకు తానుగా వెళ్ళాడు, ఆ పని చేశాడు. అంతే కానీ దేవుడే నేట్టలేదు.

 *మరొక వ్యక్తి అయిన యుధా ఇస్కరియోతు మాత్రము దీనికి పూర్తిగా విరుద్ధముగా చేశాడు.*

👉 తనకు తను తప్పిపోయాడు. అపోకార్య1:25- తన చోటికి పోవుటకు యుధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు.
*ఇందులో దేవుని ప్రమేయము ఏమి లేదు.*

*అందరు మారు మనస్సు కలిగి,క్రిస్తులా బ్రతికి,తండ్రి దగ్గరకు చేరడమనేది దేవుని చిత్తము.( గలతీ 5:1,1 తిమోతి 2:4, 11 పేతురు 3:9).*

7⃣ *చాల మందికి కలిగే ప్రశ్నను చూస్తే నేను చెడ్డవాడిగా మారి నరకానికి వెళ్లిపోతాడని తెలిసి దేవుడు నన్నెందుకు పుట్టించాడు??*
👉 దేవునికి నా భవిష్యత్తు తెలుసు గదా, మంచిగా మార్చుకోవచ్చు గదా అని అంటారు.
*దేవునికి భవిష్యత్తు తెలుసు అన్న మాట correct.*
👉 కానీ దేవుడు నీకై సిద్దపరచిన పనులు నెరవేర్చాలని,దేవుడు ఉన్న లోకానికి నీవు చేరుకోవాలన్నదే అయన(దేవుని) ఆశ.

*నువ్వు నరకానికి వెళ్ళిపోవాలని దేవుడు ఎన్నడు ఆశించలేదు,ఆశించడు కూడా...*

🔺దేవుడు జీవితాన్ని ఇచ్చాడు,స్వతంత్రత ఇచ్చాడు.

🔺సాతాను ద్వారా సమస్యలు వస్తాయని ,వాటిని ఎలా ఎదుర్కోవాలో బైబిల్ లో చెప్పాడు. ఎలా నేర్పుగా నడవాలో భోదించాడు.నడవకపోతే నరక శిక్ష ఉందని హెచ్చరించాడు.
🔺 ఎందరో భక్తులు ఎలా నడిచారో సాదృశ్యముగా వివరించాడు.
🔺దేవుడు చెప్పినట్లు నడవని వారు ఏమయ్యారో బైబిల్  లో చూపించాడు.

👉ఇప్పుడు చెప్పండి. ఇందులో దేవుని తప్పు ఏమి ఉంది???

*ఇన్ని చెప్పిన మనకై మనము తప్పిపోతే,లోకశల్లో చిక్కుకుని నరకానికి జారిపోతే దేవుని ప్రేమేయము ఏముంది????*

8⃣ *ఆత్మహత్య చేసుకోమని దేవుడు రాత వ్రాయలేదు-కానీ ఆత్మల రక్షణ కొరకు శరీరాన్ని అర్పించాలని వ్రాసుకున్నాడు(1 యోహాను 3:16),*

👉మితి మీరిన వేగంతో వెళ్లి ప్రమాదానికి గురి కావాలని దేవుడు వ్రాయలేదు-
🔺కానీ సత్య వాక్యాన్ని బహువేగంగా వ్యాప్తి చెందించి పాతాళమనే ప్రమాదము నుంచి ఎందరినో తప్పించమని వ్రాసుకున్నాడు( కొలస్సి 1:6),,

👉సాతాను పెట్టె శోధనలలో చిక్కుకుని పరలోకాన్ని పోగొట్టుకోవాలి అని వ్రాసుకోలేదు-
🔺గానీ సాతనును, వాని క్రియలను జయించాలని వానికి పరలోకములో క్రీస్తుతో పటు సింహాసనము ఇస్తానని వ్రాసుకున్నాడు(ప్రకటన 3:20)
ఆమేన్.
----------------------------------------------------------

Comments