ఇంట ఉన్న సంఘము

ఇంట ఉన్న సంఘము
.......................................

మొదటి శతాబ్దంలో విశ్వాసులు  ఒకరి ఇంట కూడు కొనేవారు. అపొస్తలులు బ్రతికి యున్న దినములలో గాని ఆ తరువాత కొంత కాలము వరకు మందిరములు నిర్మించబడలేదు.

రోమా పట్టణములో ప్రిస్కిల్లా అకుల అను దంపతుల ఇంట సంఘము ఉండి నట్లు పౌలు వ్రాసెను.(రోమా 16:3-4,1కొరింథీ 16:19)

కొలస్సి 4:15 లో నుంఫా అను వాని ఇంట సంఘము నకు పౌలు వందనములు చెప్సెను.

ఫిలోమోను యింట సంఘము ఉండి నట్లు గా పౌలు వ్రాసెను (ఫిలోమోను1:2)

సమాజముగా కూడు కొనుటకు ఆదిమ క్రైస్తవులు ఇంటింట కూడుకొనిరి. (అపొ 2:46)
 సంఘము భౌతిక మందిరములను కట్టుట కొరకు ధనమును పోగేసినట్లుగాని భౌతిక మందిరములకు విశ్వాసులకంటే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆధారములు గాని దానికి సంబంధించిన లేఖనములు గాని లేవు.
ఇంట కూడుకొనుట అనేది తప్పనిసరియైనది.
సువార్తికులు ఆత్మసంబంధమైన మందిరమనే సంఘమును అనగా రక్షణ పొందుచున్నవారిని సమకూర్చుటలోనే శ్రధ్ధవహించారు.

బిల్డింగ్ పిచ్చి ఎలా మొదలైనది ఎప్పుడు మొదలైనదో తెలియదు.
ప్రారంభములో ఒకరి ఇంట కూడుకొను విశ్వాసులు మెల్లగా భౌతిక మైన వాటి వైపు తమ మనస్సు నిలిపారు.

కొన్ని చోట్ల కూడుకొనువారు లేనందున చర్చిబిల్డింగులు అమ్మివేయడం, అద్దెకు ఇవ్వడం కూడా సాధారణమైపోయింది
అపొస్తలులు కార్యములు 17: 24 మరచిపోకూడదు.

జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.

ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయేడల మనమే ఆయన యిల్లు. (హెబ్రీ 3:6)

సంఘమును కట్టుటలో సువార్తికుడు ప్రయాసపడాలి. సంఘము కూడుకొను మందిరము విషయములో సంఘము ఆశక్తి కలిగియుండాలి. మందిరము కంటే సంఘము ముఖ్య మైనది.
మనమే దేవుని ఆలయము (1కొరింథీ 3:16,1తిమోతి3:15,1పేతురు2:5)

భౌతిక మందిరముల పైని భక్తి విగ్రహరాధనగా మారిపోవు ప్రమాదము ఉన్ఫది.
పేదవారు- ధనికులు అనే భేదము చూపించి  సమాజముగా కూడికొనినట్లయితే దూరాలోచనతో విమర్శచేసినవారు అవుతారు (యాకోబు 2:1-5)

కూడుకొను మందిరము కంటే కూడు కొను విశ్వాసులే ముఖ్య ము. దేవుడు విస్తారజనమని ఏర్పరచుకొనుటలేదు.(ద్వితి 7:7)
ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామములో కూడియుందురో అక్కడ వారి మధ్యన ఉండును.(మత్తయి 18:20)

Comments