బైబిల్ ఎందుకు చదవాలి .... బైబిల్ వలన ఉపయోగాలు కొన్ని మీముందు ఉంచే చిన్న ప్రయత్నం ;

బైబిల్ ఎందుకు చదవాలి .... బైబిల్ వలన ఉపయోగాలు కొన్ని మీముందు ఉంచే చిన్న ప్రయత్నం ;

(1) బైబిల్ మన నడతను మన ప్రవర్తనను సరిచేస్తుంది : బైబిల్ లోని కీర్తనలలో 119 వ కీర్తనలో 9 వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది : “యవ్వనస్తులు దేని చేతనైతే తమ నడతను శుద్ధి పరచుకొందురో? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా!” (119:9)

(2) బైబిల్ మనము పాపము చేయకుండా అడ్డుకుంటుంది : బైబిల్ లోని కీర్తనలలో 119 వ కీర్తనలో 9 వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది: “నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని యున్నాను “(119:11)

( 3)బైబిల్ మనకు సంతోషాన్ని కలిగిస్తుంది, కొత్త ఆలోచనలను పుట్టిస్తుంది : బైబిల్ లోని కీర్తనలలో 119 వ కీర్తనలో 24 వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది: “నీ శాసనములు నాకు ఎంతో సంతోషకరములు అవి నాకు ఆలోచన కర్తలై యున్నవి” (119:24) నీ మాటలు నాకుసంతోషమును నా హృదయానికి ఆనందమును కలగజేయుచున్నవి” యుర్మియా గ్రంధం అధ్యాయం 15 : 16 వ వచనం

(4) దేవుని వాక్యము దేవుడు అంటే భయము కలిగిస్తుంది  : బైబిల్ లోని కీర్తనలలో  119 వ కీర్తనలో 38 వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది: “నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది” (119:38)

(5) దేవుని వాక్యము నెమ్మదిని ఇస్తుంది --మనల్ని జీవింప చేస్తుంది   : బైబిల్ లోని కీర్తనలలో  119 వ కీర్తనలో 50 వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది: “నీ  వాక్యము నన్ను బ్రతికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది” (119:50)

(6)బైబిల్ జ్ఞానాన్ని అందజేస్తుంది  : శత్రువులకు మించిన జ్ఞానం,భోదకులకు మించిన జ్ఞానం,వృద్దులకు  మించిన జ్ఞానం.
(i) శత్రువులకు మించిన జ్ఞానం: బైబిల్ లోని కీర్తనలలో  119 వ కీర్తనలో 98 వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది: “నీ జ్ఞానము నిత్యము నాకు తోడుగా నున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి” (119:98)
(ii) భోదకులకు మించిన జ్ఞానం:బైబిల్ లోని కీర్తనలలో  119 వ కీర్తనలో 99 వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది: “నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులు అందిరి కంటే నాకు విశేష జ్ఞానము కలదు ” (119:99)
(iii) వృద్దులకు  మించిన జ్ఞానం: బైబిల్ లోని కీర్తనలలో119వ కీర్తనలో 100 వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది: “నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్దుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు” (119:100)

(7) దేవుని వాక్యము తేనే కంటే మదురమైనది : బైబిల్ లోని కీర్తనలలో  119 వ కీర్తనలో 103 వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది: “నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురమైనది అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి” (119:103)

(8)దేవుని వాక్యము త్రోవ చూపే మార్గదర్శి : బైబిల్ లోని కీర్తనలలో  119వ కీర్తనలో 105 వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది: “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది” (119:105)

(9) దేవుని వాక్యము పాపము అనే అంధకారంలో యున్నవారికి గొప్ప వెలుగును తెలివిని కలిగిస్తుంది  : బైబిల్ లోని కీర్తనలలో 119వ కీర్తనలో 130 వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది: “నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును” (119:130)

(10) దేవుని వాక్యము పాప స్థితి నుండి కాపాడుతుంది   : బైబిల్ లోని కీర్తనలలో  119 వ కీర్తనలో 133 వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది: “నీ వాక్యము ను బట్టి నా అడుగులు స్థిరపరచుము ,ఏ పాపము నన్ను ఏలనియ్యకుము” (119:133)

(11) దేవుని వాక్యము వలన బాధను సంతోషమును ఏక కాలములో అనుభవించగలము    : బైబిల్ లోని కీర్తనలలో  119వ కీర్తనలో 143 వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది: “శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి” (119:143)

(12) దేవుని వాక్యము వలన నెమ్మది కలుగుతుంది అడుగులు జారి పోకుండా వారిని కాపాడుతుంది  : బైబిల్ లోని కీర్తనలలో 119వ కీర్తనలో  165 వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది: నీ ధర్మ శాస్త్రమును, ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తోట్రేల్లుటకు కారణమేమియులేదు” (119:165) ఇలా ఎన్నో మంచి విషయాలు బైబిల్ లో యున్నవి మంచి ఏ మతంలోయున్న ఏ గ్రంధంలోయున్న అవి మనం తెలుసుకోవాలి మనం వాటిని ఆచరించాలి అప్పుడే మనిషి సర్వతోముఖాభివృద్ధి చెందడానికి.... ప్రపంచం శాంతి సంతోషాలతో యుండడానికి అవకాశం కలుగుతుంది….

Comments