మ్రొక్కడం, ఆరాధించడం ఒక్కటేనా..?

*మ్రొక్కడం, ఆరాధించడం ఒక్కటేనా..?*

*మ్రొక్కడం అనగా:-*

👉అత్యంత భక్తి శ్రద్దలతో నమస్కరించడం..
👉మర్యాదను కనుపరుస్తూ నమస్కరించడం..

👉జ్ఞానులు యేసును చూసి, సాగిలపడి, పూజించి, కానుకలు అర్పించిరి. అది ఆరాధనలోకి రాదు.
క్రీస్తురాజు కనుక ఆయనకు రాజ్య మర్యాదలు చేసారు (మత్త2:10-11)

👉కుష్టరోగి వచ్చి ఆయనకు మ్రొక్కెను. అది ఆరాధించడం కాదు.
తనకు కలిగిన దానిలో కృతజ్ఞత భావాన్ని వ్యక్తవపరిచాడు (మత్త8:1)

ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి కానీ అది ఆరదించుట కాదు.

*ఆరాధించడం అనగా:-*

🔯ఆరాధనకు క్రీస్తు చెప్పిన నిర్వచనం :-
John(యోహాను సువార్త) 4:21,22,23,24

21.అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;
22.మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.
23.అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను ,సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు;(మూలభాషలో-వెదుకుచున్నాడు).
➡24.దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు *ఆత్మతోను సత్యముతోను* ఆరాధింపవలెననెను.

కాబట్టి దేవుడు కోరుకొనిన ఆరాధన ఆత్మతో సత్యముతో చేయవలెనని క్రీస్తు తెలిపిఉన్నాడు.

*ఆరాదనలో చేయవలసినవి*:-
Ephesians(ఎఫెసీయులకు) 5:19
Acts(అపొస్తలుల కార్యములు) 2:42
Colossians(కొలొస్సయులకు) 3:16

👉ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహితముగా
👉మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు,
👉సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.
👉ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు,
👉మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు,
👉 అపొస్తలుల బోధయందును ?
👉?సహవాసమందును,
👉రొట్టె విరుచుట
👉ప్రార్థన చేయుట

ఇవన్ని..
👉 దేవుని చిత్త ప్రకారం
👉 ఒక క్రమమైన పద్దతిలో
👉 దేవుడు కోరిన విధంగా
👉 దేవుడు ఆజ్ఞాపించిన విధంగా
👉 ఆరాధించడం

👉 2దిన29:20-30
ఇశ్రాయేలీయులు ఆరాధించిన విధానము మనము ఇక్కడ చూడవచ్చు
బలులు అర్పించుట,
వాయిధ్యాలు వాయించుట,
బూరలు ఊదటం,
నాదము చేయుట,
తలలు వంచి,
దేవుడు ఆజ్ఞాపించిన విధంగా, దేవుడు కోరిన విధంగా చేయడం
ఆరాధన అవుతుంది.

👉 బైబిల్ క్లాస్ ఆరాధన లోకి రాదు.
👉 గృహకూటాలు,
👉ఇతరత్రా కూటములు
ఆరాధన లోకి రావు.

👉 ఆరాధన అనేది ప్రభువుదినం రోజున మాత్రమే జరిగేది.
👉అది క్రమమైన పద్దతిలో
👉 క్రమమైన విధానంలో,
👉దేవుడు కోరుకున్న విధానంలో,
👉దేవుడు ఆజ్ఞాపించిన రీతిలో జరిగేది ఆరాధన అవుతుంది.

కావున మ్రొక్కడం, ఆరాధించడం ఒకటి కాదు.

Comments