1 తిమోతి 2:8 (బహిరంగ ఆరాధనలో పురుషుడు

1 తిమోతి 2:8 (బహిరంగ ఆరాధనలో పురుషుడు):
ప్రతిస్థలములో పురుషుడు ప్రార్థించవలెను. అనగా దీని అర్ధం స్త్రీకి ప్రతిస్థలములో ఆ అవకాశం లేదు. సంఘముగా కూడిన స్థలాల్లో స్త్రీ మౌనముగానే ఉండవలెను (1కొరింథీ14:34). సంఘముగా కూడని స్థలాల్లో స్త్రీ బహిరంగంగా బోధ చేయవచ్చు మాట్లాడవచ్చు ఉపదేశించవచ్చు అధికారంతో కూడిన ఏ పనులైన చేయవచ్చు. స్త్రీల కూడికలలో పురుషుడు ఉండడు కాబట్టి స్త్రీల కూడికలలో కూడా స్త్రీలు బహిరంగ పాత్ర వహించవచ్చు. అయితే పురుషుడు కూడియున్నసంఘములో పురుషునిది బహిరంగ బాధ్యత. పురుషుడే మాట్లాడాలి, పురుషుడే నడిపించాలి, పురుషుడే బోధించాలి. దీనిని మార్చకూడదు. పై పనులు సంఘములో స్త్రీ చేయకూడదు (1 కొరింథీ14:35). కావున పురుషుడే బహిరంగ బాధ్యత వహించాలి. ఈ పాత్ర ఎలా ఉండాలి.?

#A) కోపమును మాని... నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. గనుక పురుషులు కోపించుటకు నిదానించువారై యుండవలెను (యాకోబు1:19,20). తన సహోదరుని మీద కోపపడువాడు  విమర్శకు లోనగును (మత్తయి5:22). సూర్యుడు అస్తమించువరకు మీ కోపము ఉండరాదు అని ఎఫెసీ4:26 లో రాయబడి ఉంది. కోపము సరిహద్దులో ఉండవలెను. ఎవరి మీదనైనా మనకు కోపమున్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్ల వారిని క్షమించుడి (మార్కు11:24). మనము క్షమింపని యెడల తండ్రియు మనలను క్షమింపడు. ప్రభువు మన మనవులు వినడు. దేవుని దయను మనము రుచి చూసి యున్నాము (1పేతురు2:1). కావున అదే హృదయంతో  సహోదరుల పట్ల ప్రవర్తించాలి.
#B) సంశయమును మాని... సందేహించువాడు అస్థిరుడు గనుక సంశయమును మాని ప్రార్థించాలి (యాకోబు5:1-8).
#C) పవిత్రమైన చేతులతో... దేవుడు పాపుల మనవి ఆలకింపడు (యోహాను9:31). ఎవడైనా భక్తుడై యుండి దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే వాక్యనుసారముగా జరిగించువాని మనవులే ఆయన అలకించును. నా హృదయమందు పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును (కీర్తన66:18). కాబట్టి దేవుని సన్నిధికి వచ్చునప్పుడు పవిత్రమైన చేతులతో అనగా పవిత్రమైన హృదయముతో రావలెను. చేతులు హృదయానికి సాదృశ్యము. ప్రార్థనలో చేతులెత్తుట యూదుల అలవాటు. చేతులెత్తడం కంటే పవిత్రమైన హృదయం కలిగియుండుట ముఖ్యం.

ఇవే లక్షణములు స్ట్రీలును కలిగియుండవలెను... కానీ సంఘ అధికారం పురుషునిదే. బోధించుట అనే అధికారంలో పురుషుడు ఉండాలి. ఆ బోధకు లోబడు పాత్ర కతిమా పురుషులది స్త్రీలది (1తిమోతి2:11). నేర్చుకొనిన ఆ బోధ తన కుటుంబాన్ని కట్టుటలో ఉపయోగించాలి. జ్ఞానవంతురాలు తన “ఇల్లు” కట్టును గానీ సంఘాన్ని కాదు. సంఘాన్ని కట్టే బాధ్యత పురుషునిదే. దీని అర్ధం సంఘములో స్త్రీ ఉండకూడదు అని కాదు గానీ అధికార పాత్రలో ఉండకూడదు. లోబడుచు బోధించబడిన బోధకు పూర్ణులుగా (నెరవేర్చేవారుగా) ఉండాలి. పురుషుడు తన బాధ్యతను కోపమును సంశయమును మాని పవిత్రమైన హృదయంతో నిర్వర్తించాలి...

Comments