సిపోరా
*సిప్పోరా*
సిప్పోరా అనే మాటకు పిచ్చుక అని అర్థం
ఈమె మిద్యానీయుడై
న ఇత్రో కుమార్తె
మోషే ఒకానొక సమయములో తన జీవితము తారుమారై
మతిలేనివాడై మిద్యాను దేశమునకు పారిపోయాడు.
అటువంటి సమయంలో సిప్పోరా జీవితములోనికి ప్రవేశించి
అతని జీవితానికి *చక్కని బాటగా* నిలిచింది.
*భర్తను బలపరచి ప్రోత్సహించే భార్య*
మనము మోషేను గురించి చెప్పుకున్నంతగా *అతని భార్య అయిన సిప్పోరా* గూర్చి చెప్పుకోక పోయినా ప్రతి పురుషుని వెనుక అతనిని బలపరిచే భార్య వుంటేనే తప్ప ఆ పురుషుడు గొప్పవాడు కాలేడు అని చాలా మంది
చెప్తూ వుంటారు
అది నిజం కూడ.
బహుషా ఈ సిప్పోరా కూడ మోషే జీవితంలో అంత గొప్ప పాత్ర పోషించే వుంటుంది
ఎందుకంటే ఒకానొక సమయంలో మోషే తన కుమారుని సున్నతి విషయములో దేవుడు మోషను చంప చూడగా *సిప్పోరా* ఆ సంగతి గ్రహించి అతని కుమారునికి సున్నతి చేసి మోషేను మరణం నుండి తప్పించి నట్లుగా మనము చూస్తు న్నా ము.
(నిర్గమ4:25)
*సిప్పోర పరోక్ష సేవ*
*తన భర్త తీరిక లేకుండ సేవ చేస్తున్నప్పుడు*
*అతని సేవకు ఏనాడు అడ్డు లేదు*
అందుకే మోషే అంత గొప్ప సేవ చేయగలిగాడు
ప్రతి పురుషుని వెనుక *ఇటువంటి స్త్రీ కలిగి వుండుట ఎంత ధన్యత*
ఈ రోజుల్లో తన భర్త సేవ చేస్తుంటే
సహకరించవలసిందిపోయి
ఎంతోమంది భార్యలు ఆటంకమౌతున్నారు
సిప్పోరా దేవుని గురించి
ఎరిగి వున్నదో లేదో తెలియదు కానీ మేము దేవుని ఎరుగుదుము నేడు చెప్పుకుంటున్న స్త్రీలకంటె సిప్పోర తన భర్త పట్ల తన భాధ్యతను ఎంతో చక్కగా నిర్వర్తించినట్లుగా చూస్తున్నాము
*సిప్పోరా మోషేతో* *జీవించినంత కాలం అతని* *తోడునీడగా నిలిచిందేకానీ *తన పరిధి దాటి ఏనాడూ ప్రవర్తించలేదు*
*సిప్పోరాగొప్పదనం*
ఒక సమయములో మోషే
సీనాయి పర్వతముపై నలువది రోజులు గడపవలసి వచ్చినపుడు.
ఆ నలువది దినములు ఈమె పిల్లలను పెట్టుకొని ఒంటరిగ ఎలా గడప గలిగిందో
ఆలోచన చేస్తేనే ఆమె గొప్పతనం అర్థమౌతుంది.
పరిస్థితులన్నిటిని తట్టుకొని
మోషేకు ఇబ్బంది లేకుండ ,తొను ఇబ్బందిపడినా తన సంసారాన్ని ముందుకు నడిపించింది. సాధారణంగా *భర్త గొప్పవాడయితే భార్యకూడ పేరు ప్రఖ్యాతలే కోరుకుంటుంది.వాటికోసమే తపిస్తుంది*
*గుణవతియైనభార్య*
అయితే సిప్పోర అందుకు భిన్నంగా వుంది...
*తన భర్త ఎంత గొప్పవాడు అయినప్పటికీ*
*తాను మాత్రం ఆ పేరుప్రఖ్యాతలకు దూరంగావుంది*
అది ఆమెలోని గొప్పతనం అని చెప్పవచ్చు
*ఇటువంటి భార్యను కలిగి యుండుట ముత్యము కంటే అమూల్యము*
*గుణవతియైన భార్య తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును*
(సామెతలు31:27)
*గుణవతియైన భార్య తన ఇంటివారికి వెలితి కలుగనీయదు*
(సామెతలు31:11)
*గుణవతియైన భార్య తన ఇంటి లాభప్రాప్తి కొరకు బహుగా కష్టపడి పని చేయును*
(సామెతలు31:27)
ఈ అంశము చదువు ప్రతి స్త్రీ సిప్పోరాలా భర్తను *ఆత్మీయంగానూ*
*సేవలో* *ప్రోత్సాహకరంగా*
వుండి మంందుకు నడిపించి దీవెనకరంగా వుండేలా ఆ
ప్రభువు సహాయము చేయునుగాక. ఆమెన్
*వందనములు*
*క్రీస్తు సంఘము*
🛐🛐🛐🛐

Comments
Post a Comment