ములపాపము

Genesis(ఆదికాండము) 3:12,13,14

12.అందుకు ఆదామునాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను.
13.అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతోనీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీసర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిననెను.
14.అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించ బడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్ని మన్ను తిందువు.

#ములపాపము_ఎలా_సంక్రమించిందో_చూడం :

#అపవాది : ఆ స్త్రీతోఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలముల నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడి గెను.
(మోసం చేసే మనసు)

#హవ్వ : ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును; అయితే తోట మధ్యవున్న చెట్టు ఫలము లనుగూర్చి దేవుడుమీరు చావకుండునట్లు వాటిని తిన కూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్ప ముతో అనెను.

 #అపవాది : మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా

(స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచి దియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలము లలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;
అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.
చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచ రించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగు కొనగా)

#దేవుడైన_యెహోవా : ఆదాము నీవు ఎక్కడ ఉన్నావనెను.

#ఆదాము : నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను.

#దేవుడైన_యెహోవా : నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞా పించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను.

#ఆదాము : నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ #స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను.

#దేవుడైన_యెహోవా_హవ్వతో : నీవు చేసినది యేమిటని అడుగగా

#హవ్వ : సర్పము(అపవాది) నన్ను మోసపుచ్చి నందున తింటిననెను.

#దేవుడైన_యెహోవా_సర్పముతో(అపవాది) : నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించ బడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు.

#దీని చేసినందున అంటే ఏమి జరిగిందో ఊహించండి..

#వారి_శాపములు

#సర్పము -- నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించబడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు.

#ఆదాము : ఆదామును బట్టి నేల శపించబడింది.

హవ్వకు మాత్రమే గర్బవేదన మిక్కిలి అంటే ఎక్కువగా హేచించబడినది..
నీ(స్త్రీ) సంతనమునకు గర్బవేదన అని అనలేదు.
1️⃣(గర్భం అనేది దేవుడిచ్చు బహుమానం కానీ అది శాపం కాదు, నేడు గర్బవేదన లేకుండా బిడ్డను కన్నె technology వచ్చేసింది operation)
2️⃣(మరణం అనేది నియమము కానీ అది శాపం కాదు, హెబ్రీ 9.27).

#ములపాపము :
అపవాది 👉 హవ్వ 👉 ఆదాము.

అపవాది ఆదాము హవ్వ కంటే ముందే పాపము గలవాడు, పాపమును ప్రేరేపించేవాడు

యోహాను 8:44: అపవాది ఆదినుండి వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.

Comments