సుద్దెబెజ్జం

#సూదిబెజ్జము_ఓంటె
#The_Story_of: #The_Eye_of_The_Needle

మత్తయి 19:23......
మార్కు  10:25......
లూకా.   18:25......
యీ వాఖ్యబాగాలలో .......
"పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభము" అని యేసు చెప్పాడు .

ఐతే కోందరికి విషయం అర్థంకాక "మీ యేసు ఇలా చెప్తాడా ?" అంటు అపహాస్యం చెయ్యటం Social media లో చాలా చూస్తున్నాము.
👉 అంతమాత్రమే కాదు , యేసు చెప్పిన ఆఉపమానముకు అర్థము చాలామంది మన క్రైస్తవులకు కూడా అర్థంకాలేదు . దయచేసి జాగ్రత్తగా చదువండి యీ POST ని.

👉  పాతనిబందన కాలంలోనే యెరుశలేము చుట్టు ప్రాకారము నిర్మించబడింది . జనులు పట్టనం నుండి బైటికి లోపలికి వెల్లి రావటానికి ప్రదాన ప్రవేశ ద్వారం ఉండేది . ఆ ద్వారము రాత్రి వేలల్లో శత్రువులు ప్రవేశించకుండా ఉండుటకుగాను ద్వారపాలకులు (WATCHMEN'S)మూసివేసేవారు .
ఇశ్రాయేలీయులైన వ్యాపారస్తులు ఉదయమున తమ ఓంటెలపై వ్యాపార , వర్తక సామగ్రిని వేసుకుని పరదేశం వెల్లి వ్షాపారం చేసుకుని వస్తూవుండేవారు .
ముఖ్యద్వారము రాత్రివేల మూసివేసారంటె రాజు తప్ప మరెవరు వచ్చినా తెరిచేవాల్లుకారు. ఓకవేల ఇశ్రాయేలు వ్యాపారులు తిరిగి రావటానికి ఆలస్యమైతే ,లగేట్ మూసి ఉన్నప్పుడు , ద్వారపాలకునికి తమతమ గుర్తింపు నిరూపించుకుని ,వారు ఇశ్రాయేలీయులే అని నిర్ధారన ఐనప్పుడు , ముఖ్యద్వారము కాకుండా పక్కననే సూదిబెజ్జము
( English :-- Needle eye , 
Greek :-- ῥαφίς τρυμαλιά
Transliteration: rhaphis trumalia 
Phonetic: hraf-ece' troo-mal-ee-ah' )
అనబడే చిన్నద్వారము ఉండేది . దానిని మాత్రమే తెరిచేవారు . అప్పుఞు ఆ వ్యాపారులు వారి ఓంటెలమీద ఉన్న సామగ్రిని దించి , ఓంటెను మోకాల్లమీద ఉంచి , నమ్మదిగా లోపలికి దానిని ప్రవేశింపజేసే ప్రయత్నం చేసేవారు . ప్రయత్నం చేస్తు చెస్తూ తెల్లవారిపోయేది . ఓంటె మాత్రము లోపలికి ప్రవేశించేదికాదు. తెల్లవారాక ముఖ్య ద్వారము తెరిచేవారు అప్పుడు దానిగుండా యెరూషలేము పట్టనానికి ప్రవేశించేవారు వ్యాపారులు .

  ఇక్కడ యేసు ప్రస్థావించిన సంధర్భము #ధనవంతుడు_పరలోక_ప్రవేశము ......
ఓక దనవంతుడు పరలోకంలోకంలో ప్రవేశించటం అనేది అసాద్యము , యెప్పుడు సాద్యమౌద్ది అంటె "ఓంటెపై ఉన్న సామగ్రి అనే లోడ్ ని తీసివేసినట్టు ధనవంతుడు కూడా తన ధనము అనబడే లోడ్ ని తీసేసుకోవాలి, అప్పుడే రాజ్య ప్రవేశము సాద్యము" ఇది యేసు చెప్పిన ఉదాహరన , సామెత , ఉపమానం .
అంతేకానీ ప్రత్యక్షంగా సూదిబెజ్జంములో ఓంటె దూరటం కాదు.
#The_Story_of: #The_Eye_of_The_Needle
The "eye of the needle" mentioned in the Bible, was one of the many gates providing passage through Jerusalem's massive walls. The "Needle Gate" was used when the city's main gates were closed at night. It was designed for security so that enemies could not simply ride into the city. The gate was so small, that a rich man would have to unload his camel and then with great effort, lead his camel through –a slow & difficult process. Jesus likened the process to entering heaven: we must come to God stripped of all our importance –a seemingly impossible task until we realize with God, all things are possible.

Matthew(మత్తయి సువార్త) 19:23,24,25,26
23.యేసు తన శిష్యులను చూచిధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 
24.ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను. 
25.శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడిఆలాగైతే ఎవడు రక్షణపొందగలడని అడుగగా 
26.యేసు వారిని చూచిఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. 

Mark(మార్కు సువార్త) 10:25

25.ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము. 

Luke(లూకా సువార్త) 18:25

25.ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటెదూరుట సులభమని చెప్పెను.

Comments