యేసు క్రీస్తు కన్యక గర్భం లో పుట్టడానికి కారణం :

**Copied

🙂యేసు క్రీస్తు కన్యక గర్భం లో పుట్టడానికి  కారణం :

❤యెహోవా దావీదుతో చేసిన నిభంధన -> నీ వంశం(యూదా) నుండి రాజును (యేసును) రప్పించి అతనికి నీ సింహాసనం ఇస్తాను.
✔️2సమూయేలు 7: 12
నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.
✔️నిబందన ప్రకారం యూదా వంశం నుండి రాజు(యేసు) రావలసి ఉంది. దేవుడు వాగ్దానం చేశారు కాబట్టి ఏది ఏమైనా యూదా వంశం రాజులను కాపాడి వారి నుండి యేసును రప్పించవలసియుంది.

😠అయితే దావీదు మరణం తరువాత యూదులను ఏలిన రాజుల లో ఆహాజు అనే రాజు తన కాలంలో ఒక తప్పిదం చేశాడు...
ఏంటది:?
 యెషయా 7: 1
యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేముమీదికి వచ్చిరి గాని అది వారివలన కాకపోయెను
యెషయా 7: 2
​అప్పుడుసిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసికొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను.

✔️ఆహాజు మీదికి ఇశ్రాయేలు + సిరియా దేశం వారు+ ఎఫ్రాయిమీయులతో కలిసి యుద్ధానికి వచ్చిన సమయంలో అతడికి భయం పట్టుకుంది. అయితే యూదా వంశం బీజం నుండే యేసు రావాల్సి ఉంది కాబట్టి దేవుడు అతన్ని కాపడే ఉద్దేశంతో అతనికి యెషయా ప్రవక్త ద్వారా ధైర్యం చెప్పాలని చూశారు.. నీ వెనక నేను ఉన్నాను భయం వద్దు.. దానికి proof గా కావాలి అంటే ఒక సూచన అడుగు అన్నారు.
యెషయా 7: 4
భద్రముసుమీ, నిమ్మళించుము; పొగ రాజుచున్న యీ రెండు కొరకంచు కొనలకు, అనగా రెజీనును, సిరియనులు, రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియ నీయకుము.
యెషయా 7: 11
నీ దేవుడైన యెహోవావలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే.

😡కాని ఆహాజు దేవుని మీద నమ్మకం ఉంచలేదు.. భయం తో అష్షూరు రాజు సహాయం కోరి దేవుని కుమారత్వాన్ని అమ్ముకుని అతనికి దాసుడు అయ్యాడు.
2రాజులు 16: 7
ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసికొని అష్షూరురాజునకు కానుకగా పంపి
2రాజులు 16: 8
**నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను** గనుక నీవు వచ్చి, నామీదికి లేచిన సిరియారాజు చేతిలో నుండియు ఇశ్రాయేలురాజు చేతిలో నుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతలనంపగా..

🎃ఈ విధంగా ఆహాజు తన దేవుడి మీద నమ్మకం ఉంచలేదు. దేవుడు దావీదు తో చేసిన నిబంధనను ఆహాజు మీరి అష్షూరు రాజు కి తను కుమారుడు గా నిబందన చేసుకున్నాడు. దేవుడు సూచన అడగమని యెషయా ద్వారా ధైర్యం చెప్పినాగానీ వినలేదు..
✔️యెషయా 7: 12
ఆహాజునేను అడుగను యెహోవాను శోధింప నని చెప్పగా...

😀కాబట్టి దేవుడు దావీదు సింహాసనం నుండి అతని బీజం తప్పించబూనుకొన్నాడు.. నిబందన మీరి కుమారత్వం అమ్ముకున్న అతని బీజం అవసరం లేకుండా అదే వంశం లో కన్యక నుండి యేసును పుట్టించాలి అని నిర్ణయించారు. కాబట్టి యెషయా ద్వారా ఇలా ప్రవచనం చెప్పారు..
యెషయా 7: 13
అతడుఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా, వినుడి; మనుష్యులను విసికించుట చాలదను కొని నా దేవుని కూడ విసికింతురా?
యెషయా 7: 14
కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, **కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.**
నేరావేర్పు
మత్తయి సువార్త 1:22,23
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
అని ప్రభువు *తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను.*

♥️♥️యేసు కన్యక గర్భంలో జన్మించడానికి కారణం ఆహాజు అవిధేయత... దేవుని కుమారత్వాన్ని అష్షూరు రాజుకి అమ్ముకున్న అతని బీజం ద్వారా యేసు రావటం ఇష్టం లేని దేవుడు అతని బీజం తప్పించారు. కన్యక ద్వారా రప్పించారు. అంతే కానీ జన్మ పాపం ఉంది అని కాదు... దయచేసి తప్పుడు బోధ మానండి...
 వందనములు.. 🙏🙏

Comments