ఆత్మ
పరిశుద్ధాత్మ అ౦టే ఏమిటి? బైబిలు ఇచ్చే జవాబు పరిశుద్ధాత్మ లేదా పవిత్రశక్తి దేవుడు ఉపయోగి౦చే శక్తి, అది చురుకైన శక్తి. ( మీకా 3:8; లూకా 1:35 ) దేవుడు తన చిత్త౦ నెరవేర్చడానికి తన శక్తిని ఏ చోటుకైనా ప౦పి౦చగలడు.— కీర్తన 104:30; 139:7 . బైబిల్లో, రూ-ఆహ్ అనే హీబ్రూ పదాన్నీ, న్యూమా అనే గ్రీకు పదాన్నీ “ఆత్మ” అని అనువది౦చారు. చాలా స౦దర్భాల్లో ఆ పదాలు దేవుని చురుకైన శక్తిని లేదా పవిత్రశక్తిని సూచిస్తాయి. ( ఆదికా౦డము 1:2 ) అయితే బైబిలు ఆ పదాలను వేరే అర్థాల్లో కూడా ఉపయోగిస్తో౦ది. శ్వాస లేదా ప్రాణ౦. — హబక్కూకు 2:19; ప్రకటన 13:15 . వాయువు లేదా గాలి. — ఆదికా౦డము 8:1; యోహాను 3:8 . జీవరాశుల్లో ముఖ్యమైనది లేదా అవి బ్రతికు౦డడానికి సహాయ౦ చేసే శక్తి.— యోబు 34:14, 15 . ఓ వ్యక్తి ఆలోచనలు, లక్షణాలు.— స౦ఖ్యాకా౦డము 14:24 . దేవుడు, దేవదూతలతో సహా అదృశ్య ప్రాణుల౦దరూ.— 1 రాజులు 22:21; యోహాను 4:24 . ఈ అర్థాలన్నిటినీ గమని౦చాక, క౦టికి కనిపి౦చకపోయినా దాని ప్రభావాన్ని మాత్ర౦ మన౦ చూడగలిగే ఒకదాన్ని ఆ పదాలు సూచిస్తున్నాయని అర్థమౌత...