యేసు 100% దేవుడా 100% మనవుడా?

మీరు ఆలోచించరా?
==========================================

యెహోవాయే యేసు! యేసే యెహోవా లేక యెహోవాయే కుమారునిగా ఈ లోకంలో అవతరించేశాడు! అన్నదే నిజమైతే...

1. బైబిల్లో యెహోవా, యేసుల ఇద్దరి వేర్వేరు ప్రస్తావనలు ఉండకూడదు.

2. పరలోకానికి వెళ్లిపోయాక సైతం యేసు, యెహోవాను "నా దేవుడ"ని చెప్పటం గానీ, ఆయనకు విజ్ఞాపనములు చెయ్యటం గానీ చేయకూడదు.

కానీ గమనార్హమైన విషయం ఏమిటంటే- 1. యేసు, పరలోకంలో సైతం యెహోవాను ఉద్దేశించి - "నా దేవుడు" అని ప్రకటిస్తున్నారు (ప్రకటన 3:12).

2. యేసు, పరలోకంలో తనద్వారా వచ్చువారి కొరకు దేవుని వద్ద విజ్ఞాపనములు చేస్తూ ఉన్నారు (హెబ్రీ 7:24).

అంతే కాదు, నేటి క్రైస్తవ మిత్రుల వాదన ఏమిటంటే యేసు 100% మానవుడు! 100% దేవుడు అన్నది! అదే నిజమనుకుందాం. యేసు, సిలువ వేయబడకముందు అనేక బలహీనతలు కలిగి ఉన్నాడు కాబట్టి 100% మానవుడే కదా! సరే, మరి సిలువ వేయబడిన తరువాత క్రైస్తవ పండితుల సిద్ధాంతం ప్రకారమే ఆయన 100% సర్వశక్తిమంతుడైన దేవుడైపోవాలి! కానీ, ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా బైబిల్ చెబుతుంది ఏమిటంటే- యేసు, సిలువ వేయబడిన తరువాత కూడా దేవుని శక్తి పై ఆధారపడి జీవిస్తున్నాడు అని. మరి, సిలువ వేయబడి, పరలోకంలో ఉన్నప్పుడు కూడా దేవుని శక్తి పై ఆధారపడి జీవించేవాడు 100% దేవుడు అని నమ్మటంలో అర్ధం ఉంటుందా? దీనిని బట్టి యేసు 100% మానవుడు! 100% దేవుడు అన్నది కేవలం కల్పిత సిద్ధాంతం అని అర్థం అవుతుంది కదా!

Comments