క్రైస్తవుని బాధ్యతలు


🙏క్రైస్తవుని భాధ్యతలు🙏
1)క్రైస్తవుడనగా క్రీస్తు అనుచరుడు ఆయన నను అనుసరిస్తే ఆయన కట్టిన సంఘములోనే ఉంటాడు మత్త16:18,అపో కా 20:28,ఆయన సంఘములో లేనివారు క్రస్తవులే కారు.

2)ఆయన సంఘమును రెండు భావనలతో బైబిల్ సంబోదించింది .
 A)సార్వత్రికము

    మత్త 16:18
  B)స్థానికము
   1కొరి 1:2
ప్రతీ క్రైస్తవుడు ఏదైనా ఒక స్థానిక సంఘము లో సభ్యుడుగా కొనసాగాలి.

3)ఆ స్థానిక సంఘములో తన తలాంతులను వాడాలి రోమా 12:4-10, 1కొరి 12:13-31, ఎఫె 4:11-16.

4)స్థానిక సంఘములో తన యోగ్యతను పరిక్షింపబడాలి అపో కా 6:3,15:22-24, 1కొరి 16:3, 2కొరి 8:16-19.అనగా సంఘపర్యవేక్షణలో సభ్యుడు కనసాగాలి రోమా 12:8,1పేతు 5:2.

5) ప్రతీ క్రైస్తవుడ తన సామర్థ్యాన్ని రుజువు పర్చుకోవాలంటే తను ఏ స్థానిక సంఘ సభ్యుడో ఆ స్థానిక సంఘ కార్యక్రమాలకి క్రమంగా హాజరు కావాలి యెష 2:2-4,  1కొరి 11:17-21,హెబ్రీ 10:24. ఇలా క్రమంగా హాజరగుచూ సంఘములో ప్రవర్తించవలసిన తీరును నేర్చుకోవాలి 2తిమో 3:14-15.తనకు కుదిరిన చోట ఆరాధన చేయువారు భాధ్యత గలవారు కారు వారు ఏస్థానిక సంఘముచే పరిక్షింప బడరు.
6)ప్రతి క్రైస్తవుడూ తనున్న స్థానిక సంఘములో ఏదో ఒక పనిని కల్గి యుండాలి రోమా 12:6-8,ఎఫె 4:16,స్థానిక సంఘము ఏదైనా పనిని అప్పగించాలంటే సంఘానికి క్రమంగా హాజలవ్వాలి లేకుంటే స్థానిక సంఘము  ఏపనినీ అప్పగించదు.భాధ్యత గల సభ్యులుకే భాధ్యతలు అప్పగిస్తారు.

7)భాధ్యత గల సభ్యులుగా స్థానిక సంఘములో కొనసాగుతూ ఒక నాటికి స్థానిక సంఘములో పరచారకులగాను , పెద్ధలుగా,ఎదగాలి.
అపో కా 14:23,20:17-29, 1తిమో 3:1-10,తీతు 1:5-10.సంఘపద్ధగా ఎదగటం అత్యున్నతమైన స్థితి. 1తిమో 3:1.

D.purushotham
Cell:9441307921
  Vijayawada

Comments