పురుషుడు తన భార్యను సన్మానించాలి.* (1పేతు 3:7)

*పురుషుడు తన భార్యను సన్మానించాలి.* (1పేతు 3:7)

1. జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై యున్నారని *ఎరిగి*
2. ఎక్కువ మిక్కిలి బలహీనమైన ఘటమని *సన్మానించి,*
3. మీ ప్రార్ధనలకు అభ్యంతరం కలుగకుండునట్లు
4. *జ్ఞానము చొప్పున* వారితో కాపురము చేయాలి.

👉సన్మాన గ్రహీతలలో ఒకరు నీ భార్య.
👉పురుషుడు తన భార్యను సన్మానించాలి.
👉స్త్రీని గూర్చిన వాస్తవమైన సమాచారం పురుషుడు తెలుసుకొని సన్మానించాలి.
భార్య
ఎక్కువ..
మిక్కిలి..
బలహీనమైనది.
కాబట్టి..
ఎప్పుడూ భార్యను చులకనగా మాట్లాడకూడదు.
అది కూడా తెలియదా..?
ఇది కూడా చేతకాదా..?
ఇది కూడా చేయలేవా..?
అనకూడదు. తప్పుచేస్తున్నావు.
భార్య యొక్క బలహీనతల్లో ఆమెను సన్మానించాలి.

*స్త్రీలు Emotional విషయాల్లో బలహీనులు*.

👉ఉద్వేగ భరిత సమయాల్లో వారు బలహీనులు.
👉తొందరగా కన్నీళ్ళు వస్తాయి.
సన్మానించు.
ఓదార్చు.
ఆదరించు.
కన్నీళ్ళు తుడు.
బలపరిచే మాటలు చెప్పు..
నీ భార్య ఉద్వేగ సమయంలలో నీవు సన్మానించాలి.

*స్త్రీలు శరీరం విషయంలో  బలహీనులు.*

👉శక్తిలో బలహీనులు
👉మానసికంగా బలహీనులు.
👉నీవు చేయగలిగే సహాయాన్ని ఆమెకు చెయ్...

👉మగవాళ్ళు చెప్పినంత open గా వారు చాలా విషయాలు చెప్పలేరు. అది గ్రహించగలిగినవాడే మగాడు.

*భార్యను సన్మానించు..*
*ఎమోషనల్ గా,*
*ఫిజికల్  గా,*
*సెక్సువల్ గా..*

నీవు యింట్లో ఉంటే ఆమెకు పండగ వాతావరణమే ఉండాలి. అటువంటి పరిస్ధితులు కల్పించు.

*మీ ప్రార్ధనలకు అభ్యంతరం కలుగకుండా చూసుకో..*
(1కొరిం7:5)
ప్రార్ధన చేయుటకు నీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకూ *ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి.*
మీరు మనస్సు నిలుపలేనియెడల *సాతాను మిమ్మును శోధింపకుండా తిరిగి కలుసుకొనుడి.*

*భార్యా భర్తలు విడివిడిగా ఉండాలంటే..*
*1*. ప్రార్ధన  కారణమై యుండాలి.
*2*. దానికి ఇద్దరి సమ్మతి కావాలి,
*3*. ఇద్దరూ మనసులు నిలుపగలిగనవారై యుండాలి. నిలపగలిగినంత సమయం సమ్మతి ఉండాలి.
*4*.సాతాను శోధనలో పడకముందే తిరిగి కలుసుకోవాలి.

భార్యాభర్తల కలయిక కు దేవుడు ఎంతటి ప్రాముఖ్యతనిచ్చాడో..
ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసుకోవాలి.

👉మనసు నిలుపలేనప్పుడు ప్రార్ధన అయినా మానేయండి. తప్ప ఇద్దరూ కలుసుకోండి.
👉సాతాను శోధనలలో పడకండి. తిరిగి కలుసుకోండి. తిరిగి కలుసుకొనుటకు అందుబాటులో ఉండాలి.

👉భార్యాభర్తలు కలిసి ఉండాలి. కలిసే ఉండాలి.
ఒకేచోట నివశించాలి.
సహవాసం చేయాలి.
ఒకే Bed ను పంచుకోవాలి.
అపుడు మీ ప్రార్ధనలకు ఆటంకం కలుగదు.

👉భర్త ఉద్యోగం ఒకచోట, భార్య మరోచోట ఉండకూడదు. లేదా
👉భార్య విదేశాల్లో, భర్త మరో దేశంలో ఉండకూడదు.
👉ఒకవేళ ఉన్నా.. నీ మనసు నిలుపలేని పరిస్ధితుల్లో వచ్చేసెయ్..
కానీ అపవాదికి చోటియ్యకు.

*దేవుడు మానవ బాంధవ్యాలకు ప్రాముఖ్యత నిచ్చే దేవుడు*.

Malachi(మలాకీ) 2:13,14
*యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోను కన్నీళ్లతోను రోదనముతోను తడుపుదురు.*
కాబట్టి...
*ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు*,
*తనకు అనుకూలము కాని అర్పణలను మీచేత తీసికొనకయునున్నాడు.*

*అది ఎందుకని మీరడుగగా*...

 *యౌవన కాలమందు, నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను,*
*అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా.*
దేవుడు పెండ్లి భార్య పక్షంగా ఉంటాడు.

👉 *నీ భార్య కన్నీళ్ళు నీ ప్రార్ధనలకు ఆటంకం*. ఆకన్నీళ్ళు  బలిపీఠమును తడుపుతున్నాయి.
కాబట్టి భార్య భర్తతో డీల్ చేసే విధానం బహు జాగ్రత్తగా ఉండాలి.

👉స్త్రీ యొక్క మనసు తెలుసుకున్న పురుషుడు ఆమెతో *జ్ఞానం చొప్పున కాపురం చేయాలి.*

👉కాపురం చేయడానికి భర్తకు జ్ఞానం కావాలి.
👉భార్య పాత్ర భార్యకు తెలియకుండా,
👉భర్తపాత్ర భర్తకు తెలియకుండా కాపురం చేయ కుదరదు.

👉అనేక మంది భార్యాభర్తలు కాపురాలు చేయుటలేదు.
👉ఒకే యింటిలో ఉంటూ సత్రంలో వారివలే బ్రతుకుతారు చాలామంది. అది భార్యాభర్తల గా బ్రతకటమేనా???

👉దేవుడు ప్రతీ విషయాన్ని చాలా నిశితంగా పరిశిలన చేస్తాడు. ఎంత నిశితంగా అంటే....

ఉదాహరణకు

(ఆది 38:6-10)
యూదా కుమారుడైన ఓనాను, తామారుతో కలిసికొన్నప్పుడు..  ఆసంతానం తనది కాదని ఎరిగి, తన అన్నకు సంతానం కలుగజేయకుండా, తన రేతస్సు నేలను విడిచెను.
అతడు చేసింది *యెహోవా దృష్టికి చెడ్డది కనుక దేవుడతనిని చంపివేసెను*.

👉భార్యాభర్తలు శారీరకంగా కలుసుకొనేటప్పుడు కూడా వారి ఆలోచనలు, తలంపులు, భావాలు పరిశీలిస్తున్న దేవుడు,
👉తన దృష్టికి అంగీకారంగా భార్యాభర్తల కలయిక లేకపోతే ఊరుకోడు. శిక్షిస్తాడు.

👉భార్యాభర్తల సంబంధం
👉పరిశుద్దమైన సంబంధం.
👉నిర్ధోషమైన సంబంధం.
👉వారి కలయిక నిష్కళంకం గా ఉండుటకు ఉద్దేశించబడింది.

*ప్రార్ధనలకు ఆటంకంగా ఉండే భక్తిని దేవుడు అంగీకరించడు..*

Comments